Pages

Monday, January 23, 2012

ఋష్య శృంగ గిరి

మహర్షి ఋష్యశృంగ
                                కప్పుడు "ఋష్యశృంగ గిరి" గా పిలువబడ్డ ప్రాంతమే ఇప్పటి "శృంగేరి". ఇది కర్నాటకలోని చికమగలూర్ జిల్లాలో ఉంది. జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులచే స్థాపించబడ్డ "పీఠం".  ఈ పీఠానికి మొట్టమొదటి పీఠాదిపతి శ్రీ సురేష్వరాచార్య. "అంగ" రాజ్యంలో 12 సం.లు వర్షాలు పడకపోవటంవలన సమస్త జీవరాసులు నశించిపోతున్నాయి. ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. అప్పుడు ఆ అంగ రాజ్యాధిపతి "రోమపాద",  విభాండక మహర్షి కొడుకు అయిన ఋష్యశృంగుడుని తన రాజ్యానికి పిలిపించగా, ఆ ఋష్యశృంగ మహర్షి అంగ రాజ్యంలో తన పాదం మోపిన వెంటనే వర్షాలు పడినాయి. అప్పటినుండి ఇప్పటిదాకా ఆ ప్రాంతమంతా సుభిక్షంగా, సశ్య శ్యామలంగా  ఉన్నది. శ్రుంగేరి కి 10KM దూరంలో "కిగ్గ" అనే గ్రామంలో ఋష్యశ్రంగుని దేవాలయం ఉన్నది.  

విద్యారణ్య స్వామి: హరిహర, బుక్కరాయలుచే విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపింపజేసారు. ఈయన శ్రుంగేరి పీఠానికి  12వ పీఠాదిపతి. తన గురువుగారయిన "విద్యాశంకరులు" గారి మరణించునట్టి అవశెషాలమీద ఒక గొప్ప దేవాలయాన్ని  1357వ సం.లో కట్టించారు.

విద్యాశంకర దేవాలయం: ఈ దేవాలయ కట్టడంలోని 2 అంశాలు ఇప్పటికీ ప్రపంచంలోని శాస్త్రజ్ఞులకు అంతుచిక్కలేదు.

విద్యాశంకర దేవాలయం
1). ఈ దేవాలయం మొత్తం కూడా రాళ్ళతో ఒక దానిపై ఒకటి చాలా గట్టిగా పేర్చబడినవి. ఈ రాళ్ళను అతికించడానికి కనీసం చిటికెడుకూడా  ఎటువంటి "పదార్థమూ" వాడలేదు.

ముఖద్వారం
2). ముఖద్వారంగుండా లోపలకు వెళ్ళగానే అందరూ కూర్చోవడానికి వీలుగా ఉన్న గదిలో 12 రాశిచక్రములకు గుర్తుగా 12 స్తంభాలు కట్టబడినాయి. సూర్యోదయకిరణాలు ముఖద్వారంగుండా ఏ నెలకు సంభందించిన "రాశి" యొక్క గుర్తుగా లోపల ఉన్న ఆ స్థంభం మీద ఈ కిరణాలు పడేటట్లుగా ఎంతో శాస్త్ర పరంగా, సాంకేతికంగా కట్టారు.  
        
                              ఈ దేవాలయ నలుమూలలా పైవైపుగా నాలుగైదు పెద్ద పెద్ద ఇనుపరింగులతో జేసిన గొలుసువలె,  ఆ పేర్చబడిన రాళ్ళలోనే గాలికి ఉగేటట్లుగా చెక్కారు. అప్పుడొచ్చే శబ్దం గనుక వింటే అచ్చం ఇనుప గొలుసునుండి వచ్చినట్లుగానే ఉంటుంది.  
                         
                     మన దేశంలో ప్రతి దేవాలయమూ ఇలాంటి శాస్త్రీయ, సాంకేతిక పరిజ్ఞానం తో కట్టినవే. వీటిని మతపరంగా కాకుండా "శాస్త్రీయ" దృష్ఠితో చూడగలిగి, వీటిమీద పరిశొదనలు జరిపి మన సాంకేతిక పరిజ్ఞానమును మరింతగా అభివృధ్ధి జేసుకోవచ్చని 
.............. నా ఆలోచన........

8 comments:

  1. వున్నదేమిటో చూసుకుని, ఆధునికతతో జతపరుచుకుంటే మంచిదే.

    ReplyDelete
    Replies
    1. చక్కగా చెప్పారు.

      Delete
  2. పోస్ట్ చాలా బాగుంది.
    ఇదొక అద్భుత కట్టడం.
    శృంగేరి పీఠాధిపతి మన తెలుగు వారే.

    ReplyDelete
    Replies
    1. ఔనా, క్రొత్త విషయం చెప్పారు.

      Delete
  3. చాలా బాగా చెప్పారండీ! మంచి విషయాలతో కూడిన పోస్ట్ ఇది. ఋష్యశృంగుడు అనగానే నాకు ఒక కొమ్ము ఉన్న ముని కళ్ళ ముందు కదులుతున్నాడు.

    ReplyDelete
  4. అవును, కరెక్ట్ గ చెప్పారు.

    ReplyDelete
  5. mee pariselana baagundi. maakuu chuudaalani vundi_ gnanasankar somu

    ReplyDelete
  6. mee pariseelana chaalaa baagundi._gnanasankar somu

    ReplyDelete