Pages

Monday, January 30, 2012

భాస్కరుడు............

సూర్యుడు ఏ ఒక్క మతానికో లేక ఏ దేశానికో కాక విశ్వంలోని సమస్థ జీవ కోటికి  తన చక్కటి కిరణాల వలన మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్న అన్ని గ్రహాలకి గురువు ఈ "ఆదిత్యుడు". ఈ రోజు "రధ సప్తమి", చాలా మంచి రోజు. ఈ రోజు నుండి సూర్యుడు భూమికి దగ్గరయి భూమికి పుష్కలంగా తన శక్తిని ఇస్తాడు. సర్వ దేవమయుడయిన ఈ సూర్యదేవుని ఆరాధించడం వలన తేజస్సు, చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. నిత్యం సూర్యోదయ కిరణాలు మన శరీరం మీద పడితే శరీరానికి ఎంతో మంచిది.
అందరికి చక్కటి ఆరోగ్యం ఇవ్వాలని ఆ "అదిత్యుడుని" మనసారా కోరుకుంటూ....................
 

Thursday, January 26, 2012

అవసరమే కదా...............


                         ప్రపంచంలో ఏ మనిషి (జాతి) అయినా  పుట్టినప్పటినుండి  చచ్చేంతవరకు తన జీవితాన్ని సుఖమయం చేసుకొవడానికి వివిధ రకములయిన ఆధ్యాత్మిక  మార్గాలు పాటిస్తూనే వుంటాడు (ఉంటుంది). ఆధ్యాత్మికత అంటే కేవలం నాలుగు గోడల మధ్య కూర్చోని  అలంకారాలు (అదొక తంతు గా ) చేసుకుని తన, కుటుంబ సంక్షేమ, పాపపరిహారార్ధం కోసమే అని ఎక్కడా చెప్పలేదు,  కర్మ కాండ చేయవలసినదే. "ఉపవాసం" అనేది శరీరానికి ఒక పూట విశ్రాంతి ద్వారా ఆరొగ్యాన్నిచ్చేందుకు. బాలగంగాధర్ తిలక్ మన దేశంలోని  "ఆకలి" అనే దారిద్ర్యాన్ని తొలగించటానికి ఒక్కోక్కరూ  ఒక పూట భోజనం మానేస్తే చాలూ ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని అన్నారు మహానుభావులు. 


                        ఆధ్యాత్మిక అంటే ఏదొ ఒక "దైవం" లేదా కనబడని ఒక "శక్తి " ని కొలవటం. అదే ఒక వ్యక్తి ని దైవం గా ఆరాధించటం కష్ఠం,  కారణం అతనిలో ఏదో ఒక లొపం చూడటానికే ఒక సామాన్య మానవుడి యొక్క  మనస్సు లఘ్నమవుతుంది. మనిషికి శిశుదశ నుండే ఆధ్యాత్మిక విలువలు నేర్పుతారు. ఇక చదువుకోవటం మొదలుపెట్టినప్పటి నుండి సరి అయిన దిశాదర్శనం (ముఖ్యంగా విద్యా - బుధ్ధులు ) ఇయ్యకపోతే  క్రమంగా,  క్రమశిక్షణ కు దూరమవుతాడు. అప్పుడు క్రమేణ కోరికలు జయించటం మొదలు అవుతుంది. ఆ కోరికలు బలీయమయి మనస్సును జయించడం   మొదలుపెట్టినప్పటినుండి పతనం (మానసిక, శారీరక) ఆరంభమవుతుంది. శారీరక ధృడత్వం లేకపోయినా పర్వాలేదు, కానీ మానసిక దుర్భలత్వం పనికిరాదు. ఇక్కడ ఒకటి గ్రహించాలి, సమాజంలో ఎక్కువమంది ఈ రకంగా ఆలోచిస్తున్నంతవరకు, ఏ ఒక్కరికయినా మంచిని  ఆచరించటాని మనస్సు ఒప్పుకోక పోతే అతనికి  సమాజమే సరి అయిన మార్గదర్శనం ఇస్తుంది.


                        విలువలతో ఉన్నవాడు పైకి ఆధ్యాత్మికతో ఉన్నట్లుగా కనబడకపోవచ్చు,  కానీ సమాజంలో ఏ వ్యక్తి అయినా ఉన్నతస్థాయిని చేరుకున్నాడంటే అతను తప్పని సరిగా ప్రాధమిక విద్యా దశ నుండి ఆధ్యాత్మికత, క్రమశిక్షణ, నైతిక విలువలతో కూడిన  విద్య ను తప్పనిసరిగ  అభ్యసించి  ఉంటాడు. 
 

                        పూర్వకాలం నుండి ఇన్ని రకములయిన విలువలతో కూడిన విద్య మనకుంటే, అదేమిటో మన దేశంలోని వారికి అదొక "మత" (మతం తెలిపేది ఆరాధనా పధ్ధతి మాత్రమే) పరమయిన (ఆఖరికి యోగ కూడ) విద్యగా కనబడి "మడి" కట్టుకుని వాటిని తాకనీయకుండ చేసారు. కానీ  ప్రపంచంలోని ఇతర దేశంలోని వారికి అవి "మత" పరంగా కనబడకపోగా అలాంటి "ఆధ్యాత్మిక,  క్రమశిక్షణ, నైతిక విలువలతో కలిగిన విద్య" ను మన "మడి" నుండి వారు తీసుకుని తమ "ఒడి" లో బెట్టుకుని  ఎప్పుడో అక్షరాభ్యాశం చెసేశారు.  


                        మనం కోంచె సూక్ష్మంగా ఆలోచిస్తే  మన సంస్కృతి, ఆధ్యాత్మిక, నైతిక, క్రమశిక్షణ మొదలగు వానిలో చాలా ధర్మపరమయిన, సున్నితమయిన, మన సమాజంలోని వారికే కాక ప్రపంచం లోని ప్రతి వ్యక్తి యొక్క శ్రేయస్సు  కోరేవిధంగా వున్నాయి.


                       కొంత మంది "గ్రంధకర్తలు, సంఘ సంస్కర్తలు, చరిత్రకారులు "ఏదో ఉద్దేశ్యంతో" విలువలు లేని వాటితో మనకు (ఇప్పటి తరాని వారికి) "అక్షరాభ్యాశం" చేయించి, వారు మాత్రం  వారి కుటుంబ పాపపరిహారార్ధం అన్ని రకాల ఆధ్యాత్మిక విలువలు ఎక్కడ దొరికితే అక్కడ వాటిని భద్రంగా మూట గట్టి వాళ్ళ తరతరాల సంతానానికి అందేటట్లుగా చేసుకున్నారు.  నాదొకటే సందేహం! ఈ ఆలోచన కలవారందరూ వారి కుటుంబంలోని పిల్లలను కూడా ఇదే విధంగా అనాధ్యాత్మికంగా పెంచారా, పెంచగలరా? 

మతం: ఆరాధనా పధ్ధతిని తెలియజేస్తుంది.
  జాతి: ఉనికిని తెలియజేస్తుంది.  



అని నాఅలోచన....................................

Monday, January 23, 2012

ఋష్య శృంగ గిరి

మహర్షి ఋష్యశృంగ
                                కప్పుడు "ఋష్యశృంగ గిరి" గా పిలువబడ్డ ప్రాంతమే ఇప్పటి "శృంగేరి". ఇది కర్నాటకలోని చికమగలూర్ జిల్లాలో ఉంది. జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులచే స్థాపించబడ్డ "పీఠం".  ఈ పీఠానికి మొట్టమొదటి పీఠాదిపతి శ్రీ సురేష్వరాచార్య. "అంగ" రాజ్యంలో 12 సం.లు వర్షాలు పడకపోవటంవలన సమస్త జీవరాసులు నశించిపోతున్నాయి. ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. అప్పుడు ఆ అంగ రాజ్యాధిపతి "రోమపాద",  విభాండక మహర్షి కొడుకు అయిన ఋష్యశృంగుడుని తన రాజ్యానికి పిలిపించగా, ఆ ఋష్యశృంగ మహర్షి అంగ రాజ్యంలో తన పాదం మోపిన వెంటనే వర్షాలు పడినాయి. అప్పటినుండి ఇప్పటిదాకా ఆ ప్రాంతమంతా సుభిక్షంగా, సశ్య శ్యామలంగా  ఉన్నది. శ్రుంగేరి కి 10KM దూరంలో "కిగ్గ" అనే గ్రామంలో ఋష్యశ్రంగుని దేవాలయం ఉన్నది.  

విద్యారణ్య స్వామి: హరిహర, బుక్కరాయలుచే విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపింపజేసారు. ఈయన శ్రుంగేరి పీఠానికి  12వ పీఠాదిపతి. తన గురువుగారయిన "విద్యాశంకరులు" గారి మరణించునట్టి అవశెషాలమీద ఒక గొప్ప దేవాలయాన్ని  1357వ సం.లో కట్టించారు.

విద్యాశంకర దేవాలయం: ఈ దేవాలయ కట్టడంలోని 2 అంశాలు ఇప్పటికీ ప్రపంచంలోని శాస్త్రజ్ఞులకు అంతుచిక్కలేదు.

విద్యాశంకర దేవాలయం
1). ఈ దేవాలయం మొత్తం కూడా రాళ్ళతో ఒక దానిపై ఒకటి చాలా గట్టిగా పేర్చబడినవి. ఈ రాళ్ళను అతికించడానికి కనీసం చిటికెడుకూడా  ఎటువంటి "పదార్థమూ" వాడలేదు.

ముఖద్వారం
2). ముఖద్వారంగుండా లోపలకు వెళ్ళగానే అందరూ కూర్చోవడానికి వీలుగా ఉన్న గదిలో 12 రాశిచక్రములకు గుర్తుగా 12 స్తంభాలు కట్టబడినాయి. సూర్యోదయకిరణాలు ముఖద్వారంగుండా ఏ నెలకు సంభందించిన "రాశి" యొక్క గుర్తుగా లోపల ఉన్న ఆ స్థంభం మీద ఈ కిరణాలు పడేటట్లుగా ఎంతో శాస్త్ర పరంగా, సాంకేతికంగా కట్టారు.  
        
                              ఈ దేవాలయ నలుమూలలా పైవైపుగా నాలుగైదు పెద్ద పెద్ద ఇనుపరింగులతో జేసిన గొలుసువలె,  ఆ పేర్చబడిన రాళ్ళలోనే గాలికి ఉగేటట్లుగా చెక్కారు. అప్పుడొచ్చే శబ్దం గనుక వింటే అచ్చం ఇనుప గొలుసునుండి వచ్చినట్లుగానే ఉంటుంది.  
                         
                     మన దేశంలో ప్రతి దేవాలయమూ ఇలాంటి శాస్త్రీయ, సాంకేతిక పరిజ్ఞానం తో కట్టినవే. వీటిని మతపరంగా కాకుండా "శాస్త్రీయ" దృష్ఠితో చూడగలిగి, వీటిమీద పరిశొదనలు జరిపి మన సాంకేతిక పరిజ్ఞానమును మరింతగా అభివృధ్ధి జేసుకోవచ్చని 
.............. నా ఆలోచన........

Thursday, January 12, 2012

సంక్రాంతి సుభాకాంక్షలు.............

బ్లాగ్ రచయితలందరకూ........
చక్కటి విషయాలతో సమాజంలోని ప్రతి ఒక్కరికి తెలియని విషయ పరిజ్ఞానాన్ని అందజేస్తున్నందుకు.....
ఇవే నా హృదయపూర్వక సంక్రాంతి సుభాకాంక్షలు............. 
మీ అందరి
డి. యస్. ఆర్. మూర్తి...... 


Tuesday, January 10, 2012

గాలి పటాలు..........................

                         "లికాలం", "హైటెక్" యుగంలో కొన్ని సాంప్రదాయాలు కనుమరుగవుతూ ఉన్నాయి. దురదృష్ఠకరం. పూర్వీకులు ఈ పద్దతులన్నీ ఒక మంచి ఆలోచనలతో రూపకల్పన చేసారు. ఆవు పేడ, పంచకం యొక్క విసిష్ఠమయిన, శాస్త్రీయమయిన, గుణాలను దృష్టిలో పెట్టుకునే ఈ "మకర సంక్రాంతి" పండుగతో ఎక్కువగా ముడిపెట్టారు.
                         "సంక్రాంతి", "సంక్రమణం" అంటే మారడం, చేరడం అని అర్ధం. జగత్తును వెలిగిస్తూ సకల కోటినీ ప్రదీప్తం చేస్తూన్న "సూర్య భగవానుని" గతిని బట్టి "సంక్రాంతి" ఏర్పడుతోంది. ఉదయముననే లేచి చల్లటి వాతావరణములో ఇంటిముందు కళ్ళాపి చల్లి రంగవల్లులు దిద్ది, గొబ్బిమ్మలు పెట్టి, అమ్మాయిలు తలస్నానం చేసి పట్టు పరికిణి, ఓణీ, కాళ్ళకు వెండి గజ్జలు తగిలించుకుని ఇంట్లో, వీధుల వెంట అలా నడుస్తూ వెళ్తుంటే  ఆ అందం మనస్సుకు ఒకరకమయిన అహ్లాదవాతావరణమును కలుగజేస్తుంది.   
                         ఈ పండుగలనేవి ఒక ఊరులో లేదా ఒక వీధిలో వారంతా ఒకరికొకరు కలుసుకుని మంచి, చెడుల గురించి విశ్లేషించుకుని అవసరానిబట్టి ఒకరికొకరు సహాయపడటానికని ఏర్పరిచిన "సాంప్రదాయ పధ్ధతి".  
                         ఈ "మకరసంక్రాంతి" లోని "ఉత్తరాయణ పుణ్యకాలం" గురించి అందరికీ తెలిసినదే. దేవతలకు "ఉత్తరాయణం" పగలు, "దక్షిణాయనం" రాత్రి. వెలుగును అభిలషించడం జీవకోటికి సహజం కనుక పుణ్యప్రదమైన దేవలోకంలో దక్షిణాయన కాలమందు దక్షిణ ద్వారం తెరచి, ఉత్తర ద్వారం మూసియుంచుట చేత అది పాపహేతువని, ఉత్తరాయణ కాలంలో దక్షిణ ద్వారం మూసి ఉత్తర ద్వారం తీసి ఉండటం వలన అది పుణ్యప్రదమైనదని విస్వాసం. 
                         ప్రతి ఇంటి ముందు తెల్లారేసరికి ముగ్గు పెట్టడమనేది మన భారతీయ సాంప్రదాయం, సంస్కృతి. ముగ్గు పెట్టేందుకు ఉపయోగించే సున్నపురాయి, బియ్యపు పిండి తెలుపు రంగులో ఉండటం శాంతికి చిహ్నంగా భావిస్తారు. ప్రొద్దునే కళ్ళాపి చల్లి, ముగ్గుపెట్టి, శుభ్రంగా ఉన్న ఇంట్లోకి లక్ష్మీ దేవి  ప్రవేసిస్తుందని ఓ నమ్మకం.  ముఖ్యంగా ఈ సంక్రాంతి మొదలయినప్పటినుండి ముగ్గుల రూపంలో స్త్రీలలోని సృజన బయట పడుతుంది. ముగ్గులుపెట్టడంలో, వంకర్లు లేకుండా గీతలు కలపడంలోనూ వారి ప్రత్యేకమయిన నేర్పు, ఓర్పూ తెలుస్తుంది. ఇది కూడా ఒక కళే. ఇలా ఇంటి ముందు తీర్చి దిద్దే రంగవల్లులతో ఇంటికీ ప్రత్యేక శోభ వస్తుంది.
                         భోగి పండుగ: ఈ రోజున ఆవు పేడతో చేసిన పిడకలతో మంటల వేస్తారు. శరీరానికి నువ్వుల పిండితో నలుగు పెట్టి స్నానం చేసి భోగి మంట దగ్గర చలి కాచుకోవడం వలన శరీరంలో ఉండే ఆమ్ల  గుణాన్ని హరించి శ్లేష్మాన్ని పేరుకోకుండా చేస్తుంది. ఒంటికి నలుగు పెట్టుకోవడంవలన చర్మం పైన చేరిన మలినాలను వదిలించడమే కాకుండా చర్మానికి మృదుత్వాన్నిస్తూ, పగుళ్ళురాకుండా కాపాడుతుంది. పాతవాటిని వదిలి, క్రొత్తవాటికి స్వాగతం పలుకడము, దారిద్ర్యంవంటి చెడును మంటల్లో నశింపజేసి మంచిని ప్రసాదించమని "అగ్ని" దేవుడిని ప్రార్ధించటమూ  ఈ "భోగి" పండుగలో ఉన్న ముఖ్య ఉద్దేశ్యం. విజ్ణానపరంగా చూస్తే భోగి మంటల్లో వేసే ఆవుపేడ పిడకల పొగను పీలిస్తే ఊపిరితిత్తుల చెవి, ముక్కు గొంతుల వ్యాధులు నయమవుతాయని వైద్యులు దృవీకరించారు.

                         సంక్రాంతి పండుగని పతంగుల పండుగ అని కూడా పిలుస్తారు. దాదాపుగా 2500ల సం.వ. లకు పూర్వమే "విష్ణు శర్మ" తను వ్రాసిన "పంచతంత్రం" లో ఈ గాలి పటాలగురించి  ఉదహరించారు. మన దేశంలో గాలి పటాలను ఎగురవేయని ఊరు, వీధి లేదంటే అతిశయోక్తి కాదేమో. పిల్లలు, పెద్దలు ఒకరేమిటి అందరూ చాలా ఆనందంగా ఎగురవేస్తారు. గుజరాతులో "ఉత్తరాయణ" ఆరంభానికి శూచకంగా అంతర్జాతీయ పతంగుల ఆటల పోటీలు నిర్వహిస్తునే ఉన్నారు.  
 http://www.aryabhatt.com/fast_fair_festival/festivals/international%20kite%20festival.htm 
http://hinduism.about.com/cs/festivals/a/aa011103a.htm     
కావున ఈ సంధర్భముగా మీకు, మీ కుటుంబ సభ్యులెల్లరకూ ఆరోగ్యకరమయిన, ఆనందమయిన, పుణ్యప్రదమయిన జీవితాన్ని ఇవ్వవలసినదిగా "ముక్కోటి దేవతలను" కోరుకుంటూ......

Friday, January 6, 2012

మన మంచి మనతోనే వస్తుంది.............

ర్ణుడు మహాభారత యుధ్ధం తరువాత స్వర్గానికి వెళ్ళాడు. అక్కడున్న దేవతలు సాదరంగా ఆహ్వానించి  "ఓహో!దాన, వీర, శూర కర్ణా స్వాగతం, సుస్వాగతం" అని ఆహ్వానించారు. 
లోపలికి వెళ్ళాక "కర్ణా! ఈ స్వర్గం లో ఒక నియమం ఉంది. అదేమిటంటే  నీవు భూలోకంలో ఏ ఏ దానాలు చేసావో, అవన్నీ నీకు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. నీవు చేసినన్ని దానాలు, మరే చక్రవర్తి చేయలేదు. చివరకు కవచ కుండలాలు కూడా దానం ఇచ్చావు" అన్నారు. 
"దానిదేముంది? అవి నాకెందుకు? ఏదో నామ స్మరణ చేసుకుంటూ ఇంత తిని పడుకుంటే చాలు" అన్నాడు కర్ణుడు. 
అదే చెప్తున్నాము, నీవు భూలోకములో బంగారం ఇచ్చావు. అదే ఇస్తాము. నీవు ఒక్కరికి కూడా పిడికెడు ముద్ద పెట్టలేదు. కాభట్టి నీకు ఇక్కడ అన్నం దొరకదు అని చెప్పారు. దాంతో కర్ణుడు కంగారుపడి "మరి దీనికి మార్గమేమిట్?" అని అడిగాడు. అప్పుడు దేవతలు "నీకు నెల రోజులు సమయమ ఇస్తున్నాము. నీవు వేరే రూపం లో వెళ్ళి దాన ధర్మాలు కాకుండా అన్న దానం చేసుకురా" అని పంపారు. 
"ఎంత గొప్ప వారయినా, వీరుడైనా, శూరుడైనా గుర్తుంచుకోవలసినది మనము చేసిన మంచి మాత్రమే మనతో ఉంటుంది".

 "శుసంస్కారం" నుండి గాడి తప్పి "కుసంస్కారం" లోకి వెళ్ళకుండ  వుండటానికే, విలువగల విషయము తెలిసినదే అయినా మరచిపోకూడదని  నిత్యం మననం చేసుకుంటూ ఉంటాము. 
సదా సుఖీభవ.....