Pages

Friday, December 23, 2011

హాపీ న్యూ ఇయర్.......

                  "హాపీ న్యూ ఇయర్" అనే మాట వినబడగానే చాలా మందికి మనస్సులో మెదిలేది "జనవరి 1వ తేదీ" అయితే శాస్త్రీయమైన  సంవత్సరారంభం "ఉగాది". ఈ విషయాన్ని నేడు ఎంత మంది గుర్తిస్తున్నారు? ఉగాదికి సంవత్సరాది అనే పేరయితే ఉంది గాని, "హాపీ న్యూ ఇయర్" అనగానే ఉగాది మాత్రం గుర్తుకు రాదు. కేవలం వేపపువ్వు పచ్చడి తినే పండుగ గానే నేడు "ఉగాది" భావింపబడుతోంది. ఖగోళశాస్త్ర రీత్యా ఏ ప్రత్యేకతా లేని జనవరి 1వ తేదీని సంవత్సర ఆరంభంగా భావించడం, యదార్ధ సంవత్సరాది అయిన "ఉగాది" ప్రాశస్త్యాన్ని  మరచిపోతుండడం నిజంగా మన  దురదృష్ఠకరం. 
                 ఆంగ్ల సంవత్సరాన్ని విడిచిపెట్టి  ప్రపంచ రీతికి  ఎదురీదమని కాదు. ఖగోళశాస్త్రపరంగా నిర్ణయింపబడిన యదార్ధ సంవత్సరారంభాన్ని గుర్తించమని. గృడ్డిగా అనుసరింపబడుతున్న ఆంగ్ల సంవత్సరాది పేరిట నేడు పెచ్చు మీరుతున్న "విదేశీ" అనుకరణలకూ, ఆకతాయి వేషాలకూ ఇకనైనా స్వస్తి పలికితే మంచిదని. "విష్ యూ హాపీ న్యూ ఇయర్" అలవాటు ముదురిపోయి ఒక అంటు వ్యాధిగా ఎదిగిపోతూ, పాశ్చాత్య  సంస్కృతిని మనలో నింపుతోంది. తద్వారా పెరుగుతున్న అజ్ఞానంతో విజ్ఞాన భరితమయిన మన సంస్కృతిని దూరం చేసుకుంటున్నాము.
                సంవత్స ఆరంభాన్ని నిర్ణయించడానికి విదేశీయులు చాలా అవస్థలు పడినట్లుగా మనకు చరిత్ర తెలియజేస్తోంది. కానీ మన భారతీయ హైందవ కాలమాన విషయంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా పురాణకాలమునుండీ ఖగోళ శాస్త్రపరంగా అన్నీ సక్రమంగానే లెక్కించుకుంటూ వస్తున్నట్లు చరిత్రలో చాలా సాక్ష్యాలు కనబడుతున్నాయి.
ఖగోళ శాస్త్రం : భూమి వాతావరణానికి ఆవతల ఉన్న అనంత విశ్వాన్ని "అంతరిక్షం" అంటారు. గ్రహతారకాదులతో కూడిన ఈ అంతరిక్షాన్నే "ఖగొళం" అంటారు. మన పూర్వీకులు ఈ శాస్త్రం లో ఆరితేరిన పండితులు.  విశ్వంలో(universe) ని అంశాలయిన నక్షత్రాలు, గ్రహాలు, ఉప గ్రహాలు, తోక చుక్కలు మొదలగువాటి స్థితిగతులను వివరించే శాస్త్రమే "ఖగోళ శాస్త్రం". భూమి ఒక ఆత్మ ప్రదక్షణ చేస్తే 1రోజు, చంద్రుడు ఒక భూప్రదక్షణ చేస్తే 1నెల, భూమి ఒక సూర్య ప్రదక్షణ చేస్తే 1సంవత్సరం అని కాల మానాన్ని "ఖగోళ" ఆధారంగానే లెక్కిస్తారు కదా. ఈ కాలమానంలో ఘడియలు, దినాలు, వారాలు, మాసాలు, సంవత్సరాలు మొదలగునవన్నీ మొట్టమొదటిగా ప్రపంచానికి అందజేసినది మన భారతీయులే.  ప్రపంచం మొత్తం మీద ఈ ఖగోళ శాస్త్ర పరిజ్ఞానం ఉన్నది మన దేశంలోనే. కాకపోతే బ్రిటీషు పాలన నుండి ఇప్పటి వరకు ఈ ఖగోళ శాస్త్ర సంభంధించిన జ్ఞాన భొధ మన పాఠ్యాంశాలలో  లేకపోవటం విచారకరం. కాలమాన విజ్ఞానాన్ని తెలుసుకోవాలంటే ఖగోళ శాస్త్ర పరిజ్ఞానం చాలా అవసరం.
చంద్రుని నడకలను అనుసరించి మాసాలను, సూర్యుని నడకలను అనుసరించి సంవత్సరాన్ని లెక్కించడం "చాంద్ర సౌరమాన" పద్దతి. ఖగోళ పరమైన ఈ చాంద్ర సౌరమానం పద్దతిన ఉన్నది,  ప్రస్తుతం భారతీయులు ఆచరిస్తున్నదే   "పంచాంగం". ఇతర దేశాలతో కలసి జీవించటం కోసం "విదేశీ: క్యాలెండరు వాడినా, మన స్వంత విషయాలకు మాత్రం మన పంచాగాన్నే (తిధి, వారం, నక్షత్రం, యోగం, కరణం) ఉపయోగిస్తున్నాము.
వరాహమిరుడు - యుగాది - పంచాంగం 
ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న "పంచాంగం" జ్యొతిష, గణిత, భూగోళ, పర్యావరణ, ఖగోళ శాస్త్రాలలో ప్రావీణ్యుడయిన, 2వ చంద్రగుప్తుని ఆస్థానంలో ఒకరయిన,  క్రీ.శ.499 లో ఉజ్జయిని దగ్గర గల "కపిత్తక" గ్రామంలో జన్మించిన "మిహిరుడే" "వరాహమిహిరుడు". మగధ సామ్రాజ్యంలో "వరాహ"  అనేది అత్యున్నత పురస్కారం.  
ఈయన విషువత్ రేఖ మేషరాశిలో ఉండగా వ్రాసినదే ఈ పంచాంగం. మేషరాశిలో సూర్యుడు చేరి విషువత్ రేఖపై ఉదయించే రోజునే  "సంవత్సరాది" గా జరుపుకునే వారు. మనకు క్రీ.శ. 3102 లో శ్రీ కృష్ణావతారం  చాలించటంతో ద్వాపర యుగం ముగిసి  "కలి యుగం" మొదలయినది. ఆ రోజున నవగ్రాహాలన్నీ ఒకే రేఖపై చేరి మేషరాశిలో ఉన్నాయిట. ప్రతి యుగారంభంలోనూ, సృష్టి మొదలయినప్పటి నుండి  ఇలాగే జరిగిందని మన పురాణాలు చెప్తున్నాయి.  యుగారంభం అంటే ఎలాగూ క్రొత్త సంవత్సరం ఆరంభమౌతున్నట్లే కదా. ఒక యుగానికే "ఆది దినం" కనుక ఆ రోజును "యుగాది" అన్నారు. కాల క్రమేణ ఇది "ఉగాది" గా మారినది.      
తిక మక:  
01-01-2012 ఉదాహరణగా ఆంగ్ల సంవత్సరాదిలో చూసిన ---- జనవరి 1వ తేదీ అనగా - క్రితం సంవత్సరం (2011) లోని డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి 12గంటలు దాటిన తరువాత వచ్చిన రాత్రి భాగమూ + (కలిపి) 2012 లోని జనవరి 1వ తేదీన గల పగలు భాగము + (కలిపి) 2012 జనవరి 1వ తేదీన సూర్యాస్తమయం నుండి అర్ధరాత్రి 12 గంటల భాగమూ, అనగా ఈ మూడు భాగాలు కలిపితేనే 1రోజు అవుతుంది. 
డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 తరువాత: ------------ 6 గంటలు
జనవరి 1న గల పగలు---------------------
(ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు)------ 12 గంటలు
జనవరి 1న మిగిలిన సమయము ----------

(సాయంత్రం 6 నుండి అర్ధరాత్రి 12 వరకు)-------- 6 గంటలు
                                మొత్తం---------------      24 గంటలు.  అనగా 1 రోజు.

జనవరి 1వ తేదీ రాత్రి సమయం అనగా ---- అది ఏ రాత్రి సమయము?. డిసెంబర్ 31న అర్ధరాత్రి 12గంటలు దాటిన రాత్రా లేదా జనవరి 1న సూర్యాస్తమయం తరువాత వచ్చే రాత్రా???? ..... ఈ "తిక మక" మన కాలమానంలో లేదు. 

ఖగోళ శాస్త్ర ప్రకారం 1 రోజు అనగా ఒక పగలు + (కలిపి) ఒక రాత్రి లేదా సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు గల సమయం అని నిర్ధిస్టంగా చెప్తుంది.
                   ప్రపంచమంతటా ఆచరిస్తున్న జనవరి 1 సంవత్సరాదిగా ఆచరిస్తే, జనవరి 1నుండి డిసెంబర్ 31వరకు గల అంకెలను లెక్కటపెట్టటం వలన కలిగే నష్టం లేదు, అయితే జనవరి 1 అనేది యదార్ధంగా, శాస్త్రీయంగా, సాంకేతికంగా సంవత్సరానికి మొదటి రొజు కాదని, అలాగే "ఉగాది" అంటే వేప పువ్వు పచ్చడి తినే పండగ కాదని మనం గ్రహించటమే కాకుండా, మన భారతీయ శాస్త్రపరిజ్ఞానాన్ని తరువాత తరానికి అందజేయగల  ప్రయత్నం ఉంటె  బాగుంటుందని మన అందరి ఆలోచనగా ..........
కొంతమంది మహనీయులు  పుస్తకములలో మరియు వెబ్ సైట్లలో వ్రాసినవి  నలుగురికి ఉపయోగపడాలని ఆశతో, ఆలోచనతో --- వారికి కృతజ్ఞలు.  

సేకరణ: 
1 . పోలిసెట్టి బ్రదర్స్ వారి జనవరి ఫస్ట్ Vs ఉగాది
2. http://en.wikipedia.org/wiki/Kali_Yuga 
3. http://www.gap-system.org/~history/Biographies/Varahamihira.html
4. http://calendars.wikia.com/wiki/Panchangam
5. http://en.wikipedia.org/wiki/Hindu_calendar
6. http://www.indianetzone.com/44/ancient_indian_astronomy.htm


 
Monday, December 19, 2011

దేశాభి వృద్ధి.....


కరెక్టే చాలా మంది అనుకోవచ్చు, పూర్వం మనము చాలా గొప్ప వాళ్ళమే అయితే ఏమిటి, 
ఇప్పుడు కాదు గదా. అసలు అభివ్రుధ్ధికి ఎటువంటి సిధ్ధాతమయినా ఆచరించటానికి, అమలుపరచటానికి చిత్తసుధ్ధి ఉండాలి మన పూర్వీకుల నుండి తగిన స్ఫూర్తిని పొందగలగాలి. మన విద్యా విధానాన్ని నేటి విద్యార్ధులకు ప్రపంచం లో గల ఆధునిక పరిజ్ఞానం తో కూడిన విద్య తో పాటు
మన "దేశం" మీద అవగాహన, అభిమానాన్ని ఉన్నతమయిన ఆశయాలను కలుగజేసే విధంగా మార్చుకోవాలి.
. ప్రపంచంలో ఏ మనిషికయినా పుట్టినప్పటినుండి  చచ్చేంతవరకు తన జీవితాన్ని సుఖమయం చేసుకొవడానికి వివిధ రకములయిన ఆధ్యాత్మిక మార్గాలు పాటిస్తూనే వుంటారు. ఆధ్యాతిమికత అంటే కేవలం నాలుగు గోడల మధ్య కూర్చోని  అలంకారాలు చేసుకుని తన, కుటుంబ సంక్షేమ, పాపపరిహారార్ధం అని ఎక్కడా చెప్పలేదు, 
ఆధ్యాత్మిక అంటే ఏదొ ఒక "దైవం" లేదా కనబడని ఒక "శక్తి " ని కొలవటం. అదే ఒక వ్యక్తి ని దైవం గా ఆరాధించలేము, కారణం అతనిలో ఏదో ఒక లొపం చూడటానికే మన మనస్సు లఘ్నమవుతుంది. మనిషికి శిశుదశ నుండే ఆధ్యాత్మిక విలువలు నేర్పుతారు, ఇక చదువుకోవటం మొదలుపెట్టినప్పటినుండి సరి అయిన దిశాదర్శనం(ముఖ్యంగా విద్య) సరిగా చేయకపోతే క్రమంగా క్రమశిక్షణ కు దూరమవుతాడు. క్రమేణ కోరికలు జయించటం మొదలు అవుతుంది. ఆ కోరికలు బలీయమయి మన మనస్సును జయించటం మొదలుపెట్టినప్పటినుండి మన పతనం(మానసిక, శారిరక అన్నీ)మొదలవుతుంది. ఇక్కడ మనమొకటి గ్రహించాలి, సమాజంలో ఎక్కువమంది ఈ రకంగా ఆలోచిస్తున్నంతవరకు, మనం ఆచరించటాని మన మనస్సు అంగీకరించకపోయినా మనకు సమాజమే సరి అయిన మార్గదర్శనం చేస్తుంది. 
విలువలతో ఉన్నవాడు పైకి ఆధ్యాత్మికంగా కనపడడు, కానీ సమాజంలో ఏ వ్యక్తి అయినా ఉన్నతస్థాయిని చేరుకున్నాడంటే అతను తప్పని సరిగా ఆధ్యాతికత, నైతిక విలువలతో కూడిన విద్యను అభ్యసించి ఉంటాడు.ఇన్ని రకాలయిన విలువలతో కూడిన విద్య మనకుంటే, మన దురదృష్ఠమేమిటంటే  మనం తప్ప ప్రపంచంలోని ఇతర దేశాలన్నీ ఆధ్యాత్మిక, నైతిక విలువలతో కలిగిన విద్యా భోదన  కు ఎప్పుడో "శ్రీ"కారం చుట్టారు. 
మనం కోంచె సూక్ష్మంగా చూస్తే మన సంశ్కృతి, ఆధ్యాత్మిక, నైతిక, క్రమశిక్షణ మొదలగు వానిలో చాలా ధర్మపరమయిన, సున్నితమయిన, సమాజంలోని ప్రతి వ్యక్తి యొక్క శ్రేయస్సు  కోరేవిధంగా వున్నాయి.
 ఇప్పుడున్న పరిస్థుతలకి అప్పటిగొప్పతనానికి లింకేమిటి? ---- Well, correct. There is no link. మరి అలాంటప్పుడు ఇతర దేశస్తుల పూర్వపు గొప్పదనాన్ని చిన్నాపిల్లల పాఠ్యాంశాలలో చొప్పించడం NCERT - 7th Class - Chapter "India and the World" page 75 - The Invention of paper and silk are the greatest contribution of the Chinese to the World.  మరి ఈ చరిత్ర  వూహించినదా లేదా వాస్తవమా, వాస్తవమయితే నిదర్శనమేమిటి. అలాంటప్పుడు "Zero" మనమే కనుగొన్నా మని కూడా వ్రాయవచ్చుగదా, అప్పుడు పిల్లలు motivate అవుతారు. మరి ఇప్పుడున్న పరిస్థితి  నుండి   ఉన్నతమయిన, అభివ్రుధ్ధిచెందిన దేశంగా ఎదగాలంటే ముందుగా ఏ రంగాల మీద ద్రుష్ఠి సారించాలి! అది ఎలా జరుగుతుంది!
ప్రస్తుతం అభివృద్ది చెందిన దేశాలు దే రకమయిన ఆలోచనలను అమలుపరిచారు. 
1. వ్యవసాయం: ఆహారోత్పత్తుల రంగంలో అభివ్రుధ్ధి - ఆహార భద్రతని కల్పిస్తుంది.  
    ఉద్యోగావకాశాలనిస్తుంది. తరువాత ఆర్ధికాభివ్రుధ్ధికి దారి తీస్తుంది.
2. విద్యుత్ రంగం: విద్యుత్ సరఫరా అన్నిరంగాలకి కీలకాపరమయిన ఇంధన భద్రతనిస్తుంది. 
3. విద్య, వైద్య, ఆరోగ్య రంగాలు: దీని అభివ్రుధ్ధి చిన్న కుటుంబాలను ప్రోత్సహిస్తుంది. 
వాటినుంచి సమర్ధవంతమయిన పనివాడితనం సాధ్యపడుతుంది. అటువంటి 
పనితనానికి ఉపాధి లభించే అవకాశాలు ఎక్కువ. అది సాంఘీకాభివ్రుధ్ధికి కూడా దారితీస్తుంది.
4. Information & Technology: ఈ రంగంలో అభివ్రుధ్ధి మొత్తం అభివ్రుధ్ధి కార్యక్రమాన్ని 
వేగవంతం చేస్తుంది.
5. వ్యూహాత్మక రంగం: తక్కిన ముఖ్యరంగాలయిన పరిస్రమలు, అభివ్రుధ్ధి నిలకడగా, సాంకితేక 
పరిజ్ఞానాలమీద ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. పైనుదహరించిన 5రంగాల 
సంయుక్త ప్రభావం వల్ల స్థూల జాతీయాదాయం పెరుగుదలకు సాధ్యపడుతాయి. 
అసలు మనం అభివ్రుధ్ధిచెందలేదు అని ఎవరన్నారు. ఇప్పటికి "Mathematics" లో మనమే 
ముందున్నాము. అందుకనే దీంట్లో "నోబుల్ ప్రైజ్" పెట్టలేదు. సైన్సు లో చాల ముందున్నాము.
ఎటొచ్చి "దేశాభిమానం" లో వెనుక బడి ఉన్నాము. దీన్ని సరిచేసుకుంటే చాలు, 
మన పూర్వ వైభవం తిరిగి పొందవచ్చు.

Sunday, August 7, 2011

భారతీయ దర్శనం............

మా తాతలు "నేతులు" త్రాగారు కాబట్టి మా మూతులు వాసన చూడండి అని చెప్పటానికి వ్రాయట్లేదు. కానీ ఒక మనిషి తన మనో దృష్టితో "ఆదర్శ్యమయిన వ్యక్తి" ని చూసిన తరువాత స్ఫూర్తితో తను, తన కుటుమబం మొత్తం మంచి "అభివృధ్ధి" సాధించడానికి  ఆ గొప్ప వ్యక్తి యొక్క ఆదర్శ్యాలను, అనుభవాలను  ఒక ఉత్ప్రేరకం గా ఎలా తీసుకుంటాడో, అలాగే "ప్రాధమిక దశ" వరకు ప్రపంచం లోని అన్ని దేశాలకు వ్యాపింప గాబడ్డ మన "దేశ" సాంస్కృతిక, సాంకేతిక, శాస్త్రీయ, ఆధ్యాత్మిక మొదలగు చారిత్రాత్మక మూలాలను ప్రతి "భారతీయుడు" కి అందజేయాలి. అప్పుడు కనీసం కొంతమందికయినా  మున్ముందు మన దేశ అభివృ ధ్ధికి కావలసిన "నిర్మాణత్మకమయిన" ఆలోచనలు మొదలవుతాయి. "విద్య" అనేది ఒక "మహా వృక్షం" లాంటిది. వాటి మూలాలు (వేళ్ళు) తినటానికి (జీర్ణించుకోవాలన్నా లేదా వాస్తవాలను ఒప్పుకోవాలన్నా) చేదుగా ఉంటాయి. కానీ అవి ఇచ్చే "ఫలాలు" చాలా రుచిగా ఉంటాయి.  

ఈ "మూలాలు మనందరికీ తెలిసినవే,  అయినా వీలయింతవరకు మనమందరమూ మరల గుర్తు చేసుకొని, వాటి ద్వారా స్ఫూర్తి పొందుతూ  తద్వారా "ఇప్పటి అభివృధ్ధి" కి కావలసిన మార్గాలను అన్వేషిద్దాము (క్రొత్తగా కనుక్కోవసరం లేదనుకుంట).         
"విజయం సాధించడానికి కావలసిన అర్హత లేని వ్యక్తిని దేవుడు ఇంతవరకు శృష్ఠించలేదు".  
Sree B. V. Pattabhiram). 
ప్రతి జాతి తన లక్ష్యాల్ని సాధించడానికి నలిగిపోతుంటుంది. తమసంతానానికి ఉన్నత జీవితం
చూపించడానికి తరతరాలు తమ శక్తి యుక్తులను ధారపోసాయి, పోస్తాయి. ఇందులో రహస్యం ఏమిలేదు, దాపరికం లేదు అంతకన్నా వేరే మార్గం కూడా లేదు. అయినప్పటికి కూడా మనమీ
విజయపధాన్ని అనుసరించలేక పోతున్నాము. గ్లోబలైజేషన్, ఆర్ధిక వ్యవస్థలు కుంచించుకు
పోవడం, ద్రవ్యొల్బణం, ఉగ్రవాదం, రాజకీయ అస్థిరత్వం లాంటి బయట సమస్యలకన్నా
మన జాతి మనస్తత్వాన్ని లొంగతీసుకున్న జడత్వం నుంచి, మన సంస్కృతి , విజ్ఞానం, శక్తి
సామర్ధ్యాల గురుంచి మనకి మనమే కించపరుచుకోవటం, పరాజయ మనోవృత్తి గురుంచి,
న్యూనతా భావమునుండి ముందు బయటపడాలి. అన్నిట్లకన్నా ముందు "శాంతి"ని
సంపాదించాలి. శాంతి లేనిది ప్రగతి ఉండదు. మదేశం నిజంగానే "రత్నగర్భ". మనకి
కావలసిన వనరులు మనదగ్గరనే ఉన్నాయి. ప్రతీ సారీ మనం ఆదర్శ నమూనాలను,
సిధ్ధాంతాలను, భావాలను ఎక్కడో ఒకరి దగ్గరినుండి అడుక్కొని తెచ్చుకోనక్కర్లేదు. తెచ్చుకున్నా
అవి ఇక్కడ ఇమడవు. ఎందుకంటే మన దేశం సాంస్కృతిక , సామాజిక, మతపరంగా మిగతా
దేశాలతో భిన్నంగా ఉన్నాము.
Albert Einstein తన Autobiography లో తన దేశం యొక్క Scientific development గురించి వ్రాస్తూ "అతని స్నేహితుడు వెర్నెర్ హైసెంబెర్గ్ తో కలసి ఒక పెద్ద ఓడని తయారుచేశారుట, దానిలో అన్ని సౌకర్యాలున్నాయి, ఒకటి తప్ప - అదేమిటంటే దానికి దిక్సూచి లేదుట. ఎటు వెళ్ళాలో దానికి తెలియలేదుట. టాగూర్, మహాత్మా గాంధీలాంటి వ్యక్తులూ, వారి ఆధ్యాత్మిక పూర్వీకులు అటువంటి దిక్సూచీని కనుగొన్నారు. ఆ దిక్సూచీని ఈ మానవ నౌకలో ఎందుకు పెట్టకూడదు? అది ఇరువర్గాలకీ ప్రయోజనం ఉంటుందికదా అనుకున్నారు!
                        Abraham Lincoln బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడిన గొప్ప అమెరికన్ నాయకుడు. ఆయన చెప్పిందేమిటంటే "సంతోషమేనేది ఏ కుటుమబమన్నా అనేక స్తాయిలో సాధించే పురోగతి మీదే అధారపడుతుంది. దేవుని అనుగ్రహం మానవుల జీవితాలలో దివ్యానందాన్ని నింపుతుంది. సంతొషమూ, దివ్యానందమూ ఈ భూమ్మీద దైవభద్ధమైన జీవితాన్ని జీవించడానికవసరమైన రెండు పార్స్వాలు. సంపద కోసం, అధికారంకోసం మనుష్యుల మధ్య, జాతుల మధ్య పెరిగిన పోటీలో మనం నైతిక విలువలను కొల్పోతున్నాము".
ఈ జడత్వం, న్యూనతా భావం ఎక్కడినుండి, ఎందుకు, ఎలా వచ్చింది! మన దేశం మీద మొట్టమొదటి దండయాత్ర 326 B.C., లో Alexander ద్వారా. అప్పటికి ఇప్పటి ఆధునిక యూరోపియన్ దేశాలయిన ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జెర్మెని మొదలగునవి ఇంకా పుట్టలేదు. రోమన్ ఎంపైర్ ఇంకా పునాదులు కూడా సరిగా వేసుకోలేదు. దాని తరువాత కొన్నేళ్ళ తరువాత అనగా 711 ఎ.డి లో మొహమ్మెద్ బిన్ ఖాశీం దండయాత్రతో పతనం మొదలయినది.
                         అదేమిటంటే మొదట మన దేవ భాష అయిన "సంస్కృత" భాషను మననుంచి విదేశీయులు చాలా తెలివిగా విడగొట్టారు. ఎందుకంటే వేదాలలో ఏదయితే మన అఖండమయిన "విజ్ఞాన సంపద" ఉందో అది తిరిగి మనమెక్కడ పునర్నిర్మించుకుంటామో
అని, మనం శారీరకంగా భారతీయులుగా ఉండి మానసికంగా విదేశీ ఆలోచనలు ఉండేవిధంగా వాటి స్థానంలో విలువల్లేని వారి విద్యను ప్రవేశ పెట్టారు.

                        సరే, మనకున్న అన్నిరకాల సంపదును కొల్లగొట్టి ఆ తరువాత 1947 వరకు ఏదయితే మన దేశం మీద సాంస్కృతిక, సామాజిక, సాంకేతిక, వైజ్ఞానిక, విద్య, సాహిత్యపరంగా దాడులు జరిగి మనకున్న అనంతమయిన, దివ్యమైన చరిత్రను కుదించి "ద్వాపర యుగము" ను చీకటి యుగము గాను "ఆర్యుల దండయాత్రతో" మన చరిత్రను తిరిగి వ్రాసారో , అసలయిన, గొప్పదయిన చారిత్రాత్మక నిజాలను తరువాత తరానికి అందనీయకుండా, ఒక న్యూనతా భావన గల బానిసత్వపు ఆలోచనలను ఇచ్చే ఇతర దేశీయులు వ్రాసిన చరిత్రనే స్వాతంత్ర్యము వచ్చినతరువాత కూడా మన పాఠ్యాంశ్యాల్లో చొప్పించారు. ఇప్పటికి కూడా అదే చదుతున్నాము. మరి ప్రజలకు దేశం మీద అభిమానము, ప్రేమ ఎక్కడినుండి వస్తుంది.
                        ప్రపంచానికి మనం కళల్లో, సైన్స్, టెక్నాలజీలో, ఆర్ధిక శాస్త్రంలో, సాహిత్యంలో మరియు చరిత్ర అధ్యయనంలో అత్యున్నత స్థాయి వ్యక్తిత్వాలతో పోటీపడగల వ్యక్తులను శృష్ఠించాము. వారు -
1. త్యాగరాజు, దీక్షితార్, ముత్తుస్వామి -- వాగ్గేయకారులు.
2. శుశృతుడు - క్రీ.పూ: 1000 - 600 మధ్య. "శుశృత సమ్హిత" క్రీ.శ: 800 లో అరబ్ లోకి "కితాబ్-షా-షూన్-ఏ-హింది", కితాబ్-ఐ-శుశృత" పేరున అనువదించారు. He is the first person who had done Plastic Surgery, Postmortem, removed stones from Urinary Tract, Cataract, Cesarian, treatment to Tumors, Anesthesia etc., this is almost 3000 years back.
3. చరకుడు: క్రీ.పూ: 800. "చరక స0హిత" క్రీ.శ: 987 లో పర్షియన్, అరబిక్ లోకి అనువదించారు.
4. పతంజలి: క్రీ.పూ: 200. అదృష్ఠమేమిటంటే ప్రపంచం మొత్తం ఇతని యోగ విజ్ఞానాన్ని ఆచరణలోకి పెట్టారు.
5. కణాదుడు: క్రీ.పూ: 600. అణువు - పరమాణువు.
5. ధన్వంతరి: Embryology, Physiology, Pathogenesis, Anatomy, Pharmacology etc.,
6. బ్రహ్మగుప్త: క్రీ.శ: 598. అంకగణితం, బీజగణితం - translated to Arabic.
7. వరాహమిరుడు: క్రీ.శ: 499. Explained about Galaxy, Solar energy etc.,
8. ఆర్యభట్ట : క్రీ.శ: 476. కెరళ. కుసుమపురం (పాట్నా) లోని "నలంద విశ్వ విద్యాలయంలో చదివి అక్కడే Professor గా పనిచేసారు. "ఆర్యభటీయం" రెండు భాగాలుగా వ్రాసేనాటికి అతని వయస్సు 23. అంకగణితం, బీజగణితం, త్రికొణమితి, ఖగోళ శాస్త్రం. ఈయన త్రికొణ, వ్రుత్తాల వైశాల్యాన్ని కనుగొనే శూత్రాలతో పాటు ఒక ఘనాకృతికి, పిరమిడ్ కి బరువుని కనుగొన్నాడు. "పై" విలువ 3.1416 అని ఖచ్చితంగా వివరణ ఇచ్చాడు (గ్రీకు గణిత శాస్త్రవేత్త టొలెమి కన్నా). In 1975 our first Satellite launched is named after him only.
9. భాస్కరాచార్యుడు: క్రీ.శ: 114. Born at Bijjalabada near Bijapur in Karnataka. "శిధ్ధాంత శిరోమణి" అనేది నాలుగు అధ్యాయాలుగా వ్రాసారు. ఈ అధ్యాయాన్ని చదివితే ఒక చెట్టుకి ఎన్ని ఆకులున్నాయో క్షణాల్లో చెప్పగలరుట. ఏ అంకెను కాని, సంఖ్యను కాని సున్నతో విభాగిస్తే వచ్చేది "Infinite" అని మొదటగా చెప్పినది ఇతనే. " లెక్కపెట్టడమెలాగో మనకి నేర్పిన భారతీయులకు మనమెంతో ఋణపడిఉంటాం. ఏ వైజ్ఞానిక ఆవిష్కరణకయినా సరే లెక్కపెట్టడమే పునాది" అని Albert Einstein అన్నారు. సున్నా విలువ కనుగొన్న మొట్టమొదటి గణిత శాస్త్రజ్ఞుడు. In 1979 Bhaskara I, in 1981Bhaskara II, Satellites were launched. ఇలా వ్రాసుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు -
(http://www.crystalinks.com/indiascience.html)
(
http://www.youtube.com/watch? v=Y_PfhV_Hns4&NR=1)
Sir C.V. Raman, Nagarjunudu, jahangir, Raja Jaya Singh, Meghanadhudae, Mithra, Satyendrudu, Jagadeesh Chandra Bose, Homi Baba, Saleem Ali, Krishna Rao,Kaprekar, Seshadri, Prapulla Chandra re, Bhatnagar, Beerbal Sahani, Wadia, Jayanth Vishnu Nalikar, Govindkumar Menon, Raja Ramnna, Vikramudu,Maheswari, Haragobind Khurana, etc., Abdul Kalam తన "Ignited Minds" లో వ్రాసిందేమిటంటే "ప్రాచీన సంస్కృత, సాహిత్యం వైజ్ఞానిక శూత్రాలకు, పరిశోధనలకు కాణాచి అని, అందులో విమానం నిర్మాణం, భౌతిక శాస్త్రం, వైద్యం, ఆయుర్వేదాలకు చెందిన ఎన్నోఅంశాలున్నాయిట, వాటిని ఆధునిక విజ్ఞాన శాస్త్రాలతో సమన్వయం చేసుకుంటూ పోవాలి.
ఋగ్వేదం: ఖగోళ శాస్త్రం. తురీయ బ్రహ్మ అనే దూరదర్సినితో మొట్టమొదటిసారిగా సంపూర్ణ సూర్య గ్రహణన్ని చూసింది "అత్రి" మహర్షి (10 వ మండలం లో ఉందిట) Still today World wide research is going on.
యజుర్వేదం: యజ్ఞ విధులు, వాణిజ్యం, వ్యవసాయం, వాస్తు, దైవారాధన, జ్యొతిష, - ఇప్పుడు ఈ వేదం మనకి అందుబాటులో లేదు.
సామవేదం: గాన విధులు, వాయిద్యాల వివరణ, నృత్య సంగీత శాస్త్రాలు.,
అధర్వణ వేదం: వైద్య, సామాజిక, గృహాలు, భూములు, దేశ శాంతి, దేశ భక్తి, స్త్రీల హక్కులు - విధులు, మంత్ర శాస్త్రం, వైజ్ఞానిక పరికరాలు.వేదకాలంలో హైందవ ధర్మం తప్ప మతమనేది లేదు. ప్రపంచ భాషలన్నింటిలోనూ మన "సంస్కృత" భాష చాలా గొప్పదని, దీని ఉచ్చారణ, అక్షర ప్రయోగం, ఆధునిక Computer Programs కి మిగిలిన భాషలకంటే చాలా అనుకూలంగా ఉన్నదని వర్ధమాన దేశాలన్నీ ఒప్పుకున్నాయి. ( See Link: http://www.zeenews.com/news281904.html) పూర్వం ఇతరదేశాలనుండి ఇక్కడకు వచ్చి తక్షశిల, నలంద, కాశీ విశ్వ విద్యాలయాల్లో చదువుకుని ఆ విద్యను వారి దేశ అభివృధ్ధికి ఉపయోగించుకున్నారు. ఇప్పుడు మనం వెళ్ళాల్సిన దుస్థితి ఏర్పడినది. ఇప్పటికీ ప్రపంచం మొత్తం మీద మేధవుల శాతంలో మనమే ఎక్కువ, కాకపోతే ఆ మేధావుల వలన సేవలు మనకి కాకుండా ఇతరదేశాలకు ఉపయోగపడుతోంది.
                        దీనికి కారణం మన విధ్యావిధానాన్ని మనకు కావలసిన విధంగా ఇప్పటికీ తయారు చేసుకోలేకపోయాం. వేదాలు మతపరమైనవని, రామాయణ మహాభారతాలు కట్టుకధలని, వాటిని వక్రీకరించి ఇలా అన్ని రంగాలలోనూ రుద్ది విలువలులేని అలోచనలతో సగటు మనిషిని వివశుడను చేసాయి. ఈ వేదాలూ, రామాయణ మహాభారత కావ్యాలు, సంస్కృత భాష ఇతర దేశంలోని ఇతర మతస్థులకు  అవి మతగ్రంధాలుగా కాక విజ్ఞాన భాండాగారాలుగా కనపడ్డాయి.
                        "మన తాతలకాలంలో నేతులు త్రాగారు, ఇప్పుడు మా మూతులు వాసన చూడండి" అని కాకుండ నాటి నేతుల రుచి మనమూ చూసే విధంగా మనకవసరమయిన క్రొత్తదనాన్ని పాత వాటికి జోడించుకునేవిధంగా మన వ్యవస్థ మారవలసి ఉంటుంది. ఋగ్వేదంలో ఒక సూక్తి -  
                                        "ఆనో భద్రహ క్రతవోయంతు విశ్వతహ". 
                                   Let noble thoughts comes to us from all sides.
                        కాబట్టి ముందు మన సంస్కృతి యొక్క మూలాలనుండి మొదలుపెట్టి, ఆధ్యాత్మిక చింతనతో(విజ్ఞానాన్ని మతంతో ముడిపెట్టకుండా), (మతం తెలిపేది - ఆ మతం యొక్క అరాధనాపద్దతి, సంస్కృతి, ఉనికి - జాతిని తెలుపుతుంది), ఉండాలి. శైశవదశనుండి 15 సంవత్సరములవరకు ఆధ్యాత్మిక చింతనతో ఎదగాలి. ఎందుకటే సగటు మనిషి గౌరవ భావము, నైతికవిలువలు, ధర్మాధర్మ విచక్షణలు అలవరచుకోకపోతే ఎవరినీ లెక్కచేయడు. అందుకనే ఇదివరకు "విధ్యా-భుద్దులు" అనేవి కలిసి ఉందేవి. ఇప్పుడు భుద్దులు అనేది తీసేసి విద్య నొక్కదానినే నేర్చుకుంటున్నారు. కాబట్టి విద్యా భోదనలలో, వైజ్ఞానిక భోదనలలో భాగంగా మన పాఠాలలో మన సాంస్కృతికపరంగా రూపొందించిన విజ్ఞానాన్ని, స్ఫూర్తినిచ్చే విధంగా మనశాస్త్రజ్ఞులయొక్క గొప్పతనాన్ని, ధర్మశాస్త్రాల పరిజ్ఞానం, సాధు, సత్పురుషుల గురించి ఉన్న అంశాలతోబాటు ఆధ్యాత్మిక విలువలకు కూడా శిక్షణ ఇస్తే అప్పుడు మనుష్యులు శీలవంతులవుతారు. పూర్వం గురుకులాలో భోదన, తారతమ్యం లేకుండా అందరికీ భొదన జరిగేది. ఇలా జరిగితే మనం ఇప్పుడు చూడలేకపోయినా మన తరువాత తరం వారు తప్పకుండా మంచి భవిష్యత్తును చూడగలరు, ఇది సత్యం. ఎందుకంటే మనది అనుకునే అపారమయిన సంపదలో సుఖం ఒక్కటే కాకుండా విలువలు కూడా ఉన్నాయని, అవి ఆచరిస్తే ఆనందంగా ఉండగలమని ఇతర దేశాలు ఆశిస్తున్నాయి, వాటిని ఆచరిస్తున్నాయి.
https://docs.google.com/viewer?a=v&pid=gmail&attid=0.1&thid=13051233e1d1c5e0&mt=application/vnd.ms-powerpoint&url=https://mail.google.com/mail/?ui%3D2%26ik%3De7bc7b2620%26view%3Datt%26th%3D13051233e1d1c5e0%26attid%3D0.1%26disp%3Dsafe%26realattid%3Df_gofwljql0%26zw&sig=AHIEtbSeXv9nEl2kK6quqURk3jbGmS8iGg&pli=౧
నోట్: సేకరణ: నా దేశ యువజనులారా (శ్రీ ఎ. పి. జె. అబ్దుల్ కలాం).