Pages

Friday, December 23, 2011

హాపీ న్యూ ఇయర్.......

                  "హాపీ న్యూ ఇయర్" అనే మాట వినబడగానే చాలా మందికి మనస్సులో మెదిలేది "జనవరి 1వ తేదీ" అయితే శాస్త్రీయమైన  సంవత్సరారంభం "ఉగాది". ఈ విషయాన్ని నేడు ఎంత మంది గుర్తిస్తున్నారు? ఉగాదికి సంవత్సరాది అనే పేరయితే ఉంది గాని, "హాపీ న్యూ ఇయర్" అనగానే ఉగాది మాత్రం గుర్తుకు రాదు. కేవలం వేపపువ్వు పచ్చడి తినే పండుగ గానే నేడు "ఉగాది" భావింపబడుతోంది. ఖగోళశాస్త్ర రీత్యా ఏ ప్రత్యేకతా లేని జనవరి 1వ తేదీని సంవత్సర ఆరంభంగా భావించడం, యదార్ధ సంవత్సరాది అయిన "ఉగాది" ప్రాశస్త్యాన్ని  మరచిపోతుండడం నిజంగా మన  దురదృష్ఠకరం. 
                 ఆంగ్ల సంవత్సరాన్ని విడిచిపెట్టి  ప్రపంచ రీతికి  ఎదురీదమని కాదు. ఖగోళశాస్త్రపరంగా నిర్ణయింపబడిన యదార్ధ సంవత్సరారంభాన్ని గుర్తించమని. గృడ్డిగా అనుసరింపబడుతున్న ఆంగ్ల సంవత్సరాది పేరిట నేడు పెచ్చు మీరుతున్న "విదేశీ" అనుకరణలకూ, ఆకతాయి వేషాలకూ ఇకనైనా స్వస్తి పలికితే మంచిదని. "విష్ యూ హాపీ న్యూ ఇయర్" అలవాటు ముదురిపోయి ఒక అంటు వ్యాధిగా ఎదిగిపోతూ, పాశ్చాత్య  సంస్కృతిని మనలో నింపుతోంది. తద్వారా పెరుగుతున్న అజ్ఞానంతో విజ్ఞాన భరితమయిన మన సంస్కృతిని దూరం చేసుకుంటున్నాము.
                సంవత్స ఆరంభాన్ని నిర్ణయించడానికి విదేశీయులు చాలా అవస్థలు పడినట్లుగా మనకు చరిత్ర తెలియజేస్తోంది. కానీ మన భారతీయ హైందవ కాలమాన విషయంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా పురాణకాలమునుండీ ఖగోళ శాస్త్రపరంగా అన్నీ సక్రమంగానే లెక్కించుకుంటూ వస్తున్నట్లు చరిత్రలో చాలా సాక్ష్యాలు కనబడుతున్నాయి.
ఖగోళ శాస్త్రం : భూమి వాతావరణానికి ఆవతల ఉన్న అనంత విశ్వాన్ని "అంతరిక్షం" అంటారు. గ్రహతారకాదులతో కూడిన ఈ అంతరిక్షాన్నే "ఖగొళం" అంటారు. మన పూర్వీకులు ఈ శాస్త్రం లో ఆరితేరిన పండితులు.  విశ్వంలో(universe) ని అంశాలయిన నక్షత్రాలు, గ్రహాలు, ఉప గ్రహాలు, తోక చుక్కలు మొదలగువాటి స్థితిగతులను వివరించే శాస్త్రమే "ఖగోళ శాస్త్రం". భూమి ఒక ఆత్మ ప్రదక్షణ చేస్తే 1రోజు, చంద్రుడు ఒక భూప్రదక్షణ చేస్తే 1నెల, భూమి ఒక సూర్య ప్రదక్షణ చేస్తే 1సంవత్సరం అని కాల మానాన్ని "ఖగోళ" ఆధారంగానే లెక్కిస్తారు కదా. ఈ కాలమానంలో ఘడియలు, దినాలు, వారాలు, మాసాలు, సంవత్సరాలు మొదలగునవన్నీ మొట్టమొదటిగా ప్రపంచానికి అందజేసినది మన భారతీయులే.  ప్రపంచం మొత్తం మీద ఈ ఖగోళ శాస్త్ర పరిజ్ఞానం ఉన్నది మన దేశంలోనే. కాకపోతే బ్రిటీషు పాలన నుండి ఇప్పటి వరకు ఈ ఖగోళ శాస్త్ర సంభంధించిన జ్ఞాన భొధ మన పాఠ్యాంశాలలో  లేకపోవటం విచారకరం. కాలమాన విజ్ఞానాన్ని తెలుసుకోవాలంటే ఖగోళ శాస్త్ర పరిజ్ఞానం చాలా అవసరం.
చంద్రుని నడకలను అనుసరించి మాసాలను, సూర్యుని నడకలను అనుసరించి సంవత్సరాన్ని లెక్కించడం "చాంద్ర సౌరమాన" పద్దతి. ఖగోళ పరమైన ఈ చాంద్ర సౌరమానం పద్దతిన ఉన్నది,  ప్రస్తుతం భారతీయులు ఆచరిస్తున్నదే   "పంచాంగం". ఇతర దేశాలతో కలసి జీవించటం కోసం "విదేశీ: క్యాలెండరు వాడినా, మన స్వంత విషయాలకు మాత్రం మన పంచాగాన్నే (తిధి, వారం, నక్షత్రం, యోగం, కరణం) ఉపయోగిస్తున్నాము.
వరాహమిరుడు - యుగాది - పంచాంగం 
ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న "పంచాంగం" జ్యొతిష, గణిత, భూగోళ, పర్యావరణ, ఖగోళ శాస్త్రాలలో ప్రావీణ్యుడయిన, 2వ చంద్రగుప్తుని ఆస్థానంలో ఒకరయిన,  క్రీ.శ.499 లో ఉజ్జయిని దగ్గర గల "కపిత్తక" గ్రామంలో జన్మించిన "మిహిరుడే" "వరాహమిహిరుడు". మగధ సామ్రాజ్యంలో "వరాహ"  అనేది అత్యున్నత పురస్కారం.  
ఈయన విషువత్ రేఖ మేషరాశిలో ఉండగా వ్రాసినదే ఈ పంచాంగం. మేషరాశిలో సూర్యుడు చేరి విషువత్ రేఖపై ఉదయించే రోజునే  "సంవత్సరాది" గా జరుపుకునే వారు. మనకు క్రీ.శ. 3102 లో శ్రీ కృష్ణావతారం  చాలించటంతో ద్వాపర యుగం ముగిసి  "కలి యుగం" మొదలయినది. ఆ రోజున నవగ్రాహాలన్నీ ఒకే రేఖపై చేరి మేషరాశిలో ఉన్నాయిట. ప్రతి యుగారంభంలోనూ, సృష్టి మొదలయినప్పటి నుండి  ఇలాగే జరిగిందని మన పురాణాలు చెప్తున్నాయి.  యుగారంభం అంటే ఎలాగూ క్రొత్త సంవత్సరం ఆరంభమౌతున్నట్లే కదా. ఒక యుగానికే "ఆది దినం" కనుక ఆ రోజును "యుగాది" అన్నారు. కాల క్రమేణ ఇది "ఉగాది" గా మారినది.      
తిక మక:  
01-01-2012 ఉదాహరణగా ఆంగ్ల సంవత్సరాదిలో చూసిన ---- జనవరి 1వ తేదీ అనగా - క్రితం సంవత్సరం (2011) లోని డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి 12గంటలు దాటిన తరువాత వచ్చిన రాత్రి భాగమూ + (కలిపి) 2012 లోని జనవరి 1వ తేదీన గల పగలు భాగము + (కలిపి) 2012 జనవరి 1వ తేదీన సూర్యాస్తమయం నుండి అర్ధరాత్రి 12 గంటల భాగమూ, అనగా ఈ మూడు భాగాలు కలిపితేనే 1రోజు అవుతుంది. 
డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 తరువాత: ------------ 6 గంటలు
జనవరి 1న గల పగలు---------------------
(ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు)------ 12 గంటలు
జనవరి 1న మిగిలిన సమయము ----------

(సాయంత్రం 6 నుండి అర్ధరాత్రి 12 వరకు)-------- 6 గంటలు
                                మొత్తం---------------      24 గంటలు.  అనగా 1 రోజు.

జనవరి 1వ తేదీ రాత్రి సమయం అనగా ---- అది ఏ రాత్రి సమయము?. డిసెంబర్ 31న అర్ధరాత్రి 12గంటలు దాటిన రాత్రా లేదా జనవరి 1న సూర్యాస్తమయం తరువాత వచ్చే రాత్రా???? ..... ఈ "తిక మక" మన కాలమానంలో లేదు. 

ఖగోళ శాస్త్ర ప్రకారం 1 రోజు అనగా ఒక పగలు + (కలిపి) ఒక రాత్రి లేదా సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు గల సమయం అని నిర్ధిస్టంగా చెప్తుంది.
                   ప్రపంచమంతటా ఆచరిస్తున్న జనవరి 1 సంవత్సరాదిగా ఆచరిస్తే, జనవరి 1నుండి డిసెంబర్ 31వరకు గల అంకెలను లెక్కటపెట్టటం వలన కలిగే నష్టం లేదు, అయితే జనవరి 1 అనేది యదార్ధంగా, శాస్త్రీయంగా, సాంకేతికంగా సంవత్సరానికి మొదటి రొజు కాదని, అలాగే "ఉగాది" అంటే వేప పువ్వు పచ్చడి తినే పండగ కాదని మనం గ్రహించటమే కాకుండా, మన భారతీయ శాస్త్రపరిజ్ఞానాన్ని తరువాత తరానికి అందజేయగల  ప్రయత్నం ఉంటె  బాగుంటుందని మన అందరి ఆలోచనగా ..........
కొంతమంది మహనీయులు  పుస్తకములలో మరియు వెబ్ సైట్లలో వ్రాసినవి  నలుగురికి ఉపయోగపడాలని ఆశతో, ఆలోచనతో --- వారికి కృతజ్ఞలు.  

సేకరణ: 
1 . పోలిసెట్టి బ్రదర్స్ వారి జనవరి ఫస్ట్ Vs ఉగాది
2. http://en.wikipedia.org/wiki/Kali_Yuga 
3. http://www.gap-system.org/~history/Biographies/Varahamihira.html
4. http://calendars.wikia.com/wiki/Panchangam
5. http://en.wikipedia.org/wiki/Hindu_calendar
6. http://www.indianetzone.com/44/ancient_indian_astronomy.htm


 




Monday, December 19, 2011

దేశాభి వృద్ధి.....


కరెక్టే చాలా మంది అనుకోవచ్చు, పూర్వం మనము చాలా గొప్ప వాళ్ళమే అయితే ఏమిటి, 
ఇప్పుడు కాదు గదా. అసలు అభివ్రుధ్ధికి ఎటువంటి సిధ్ధాతమయినా ఆచరించటానికి, అమలుపరచటానికి చిత్తసుధ్ధి ఉండాలి మన పూర్వీకుల నుండి తగిన స్ఫూర్తిని పొందగలగాలి. మన విద్యా విధానాన్ని నేటి విద్యార్ధులకు ప్రపంచం లో గల ఆధునిక పరిజ్ఞానం తో కూడిన విద్య తో పాటు
మన "దేశం" మీద అవగాహన, అభిమానాన్ని ఉన్నతమయిన ఆశయాలను కలుగజేసే విధంగా మార్చుకోవాలి.
. ప్రపంచంలో ఏ మనిషికయినా పుట్టినప్పటినుండి  చచ్చేంతవరకు తన జీవితాన్ని సుఖమయం చేసుకొవడానికి వివిధ రకములయిన ఆధ్యాత్మిక మార్గాలు పాటిస్తూనే వుంటారు. ఆధ్యాతిమికత అంటే కేవలం నాలుగు గోడల మధ్య కూర్చోని  అలంకారాలు చేసుకుని తన, కుటుంబ సంక్షేమ, పాపపరిహారార్ధం అని ఎక్కడా చెప్పలేదు, 
ఆధ్యాత్మిక అంటే ఏదొ ఒక "దైవం" లేదా కనబడని ఒక "శక్తి " ని కొలవటం. అదే ఒక వ్యక్తి ని దైవం గా ఆరాధించలేము, కారణం అతనిలో ఏదో ఒక లొపం చూడటానికే మన మనస్సు లఘ్నమవుతుంది. మనిషికి శిశుదశ నుండే ఆధ్యాత్మిక విలువలు నేర్పుతారు, ఇక చదువుకోవటం మొదలుపెట్టినప్పటినుండి సరి అయిన దిశాదర్శనం(ముఖ్యంగా విద్య) సరిగా చేయకపోతే క్రమంగా క్రమశిక్షణ కు దూరమవుతాడు. క్రమేణ కోరికలు జయించటం మొదలు అవుతుంది. ఆ కోరికలు బలీయమయి మన మనస్సును జయించటం మొదలుపెట్టినప్పటినుండి మన పతనం(మానసిక, శారిరక అన్నీ)మొదలవుతుంది. ఇక్కడ మనమొకటి గ్రహించాలి, సమాజంలో ఎక్కువమంది ఈ రకంగా ఆలోచిస్తున్నంతవరకు, మనం ఆచరించటాని మన మనస్సు అంగీకరించకపోయినా మనకు సమాజమే సరి అయిన మార్గదర్శనం చేస్తుంది. 
విలువలతో ఉన్నవాడు పైకి ఆధ్యాత్మికంగా కనపడడు, కానీ సమాజంలో ఏ వ్యక్తి అయినా ఉన్నతస్థాయిని చేరుకున్నాడంటే అతను తప్పని సరిగా ఆధ్యాతికత, నైతిక విలువలతో కూడిన విద్యను అభ్యసించి ఉంటాడు.ఇన్ని రకాలయిన విలువలతో కూడిన విద్య మనకుంటే, మన దురదృష్ఠమేమిటంటే  మనం తప్ప ప్రపంచంలోని ఇతర దేశాలన్నీ ఆధ్యాత్మిక, నైతిక విలువలతో కలిగిన విద్యా భోదన  కు ఎప్పుడో "శ్రీ"కారం చుట్టారు. 
మనం కోంచె సూక్ష్మంగా చూస్తే మన సంశ్కృతి, ఆధ్యాత్మిక, నైతిక, క్రమశిక్షణ మొదలగు వానిలో చాలా ధర్మపరమయిన, సున్నితమయిన, సమాజంలోని ప్రతి వ్యక్తి యొక్క శ్రేయస్సు  కోరేవిధంగా వున్నాయి.
 ఇప్పుడున్న పరిస్థుతలకి అప్పటిగొప్పతనానికి లింకేమిటి? ---- Well, correct. There is no link. మరి అలాంటప్పుడు ఇతర దేశస్తుల పూర్వపు గొప్పదనాన్ని చిన్నాపిల్లల పాఠ్యాంశాలలో చొప్పించడం NCERT - 7th Class - Chapter "India and the World" page 75 - The Invention of paper and silk are the greatest contribution of the Chinese to the World.  మరి ఈ చరిత్ర  వూహించినదా లేదా వాస్తవమా, వాస్తవమయితే నిదర్శనమేమిటి. అలాంటప్పుడు "Zero" మనమే కనుగొన్నా మని కూడా వ్రాయవచ్చుగదా, అప్పుడు పిల్లలు motivate అవుతారు. మరి ఇప్పుడున్న పరిస్థితి  నుండి   ఉన్నతమయిన, అభివ్రుధ్ధిచెందిన దేశంగా ఎదగాలంటే ముందుగా ఏ రంగాల మీద ద్రుష్ఠి సారించాలి! అది ఎలా జరుగుతుంది!
ప్రస్తుతం అభివృద్ది చెందిన దేశాలు దే రకమయిన ఆలోచనలను అమలుపరిచారు. 
1. వ్యవసాయం: ఆహారోత్పత్తుల రంగంలో అభివ్రుధ్ధి - ఆహార భద్రతని కల్పిస్తుంది.  
    ఉద్యోగావకాశాలనిస్తుంది. తరువాత ఆర్ధికాభివ్రుధ్ధికి దారి తీస్తుంది.
2. విద్యుత్ రంగం: విద్యుత్ సరఫరా అన్నిరంగాలకి కీలకాపరమయిన ఇంధన భద్రతనిస్తుంది. 
3. విద్య, వైద్య, ఆరోగ్య రంగాలు: దీని అభివ్రుధ్ధి చిన్న కుటుంబాలను ప్రోత్సహిస్తుంది. 
వాటినుంచి సమర్ధవంతమయిన పనివాడితనం సాధ్యపడుతుంది. అటువంటి 
పనితనానికి ఉపాధి లభించే అవకాశాలు ఎక్కువ. అది సాంఘీకాభివ్రుధ్ధికి కూడా దారితీస్తుంది.
4. Information & Technology: ఈ రంగంలో అభివ్రుధ్ధి మొత్తం అభివ్రుధ్ధి కార్యక్రమాన్ని 
వేగవంతం చేస్తుంది.
5. వ్యూహాత్మక రంగం: తక్కిన ముఖ్యరంగాలయిన పరిస్రమలు, అభివ్రుధ్ధి నిలకడగా, సాంకితేక 
పరిజ్ఞానాలమీద ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. పైనుదహరించిన 5రంగాల 
సంయుక్త ప్రభావం వల్ల స్థూల జాతీయాదాయం పెరుగుదలకు సాధ్యపడుతాయి. 
అసలు మనం అభివ్రుధ్ధిచెందలేదు అని ఎవరన్నారు. ఇప్పటికి "Mathematics" లో మనమే 
ముందున్నాము. అందుకనే దీంట్లో "నోబుల్ ప్రైజ్" పెట్టలేదు. సైన్సు లో చాల ముందున్నాము.
ఎటొచ్చి "దేశాభిమానం" లో వెనుక బడి ఉన్నాము. దీన్ని సరిచేసుకుంటే చాలు, 
మన పూర్వ వైభవం తిరిగి పొందవచ్చు.