Pages

Thursday, January 26, 2012

అవసరమే కదా...............


                         ప్రపంచంలో ఏ మనిషి (జాతి) అయినా  పుట్టినప్పటినుండి  చచ్చేంతవరకు తన జీవితాన్ని సుఖమయం చేసుకొవడానికి వివిధ రకములయిన ఆధ్యాత్మిక  మార్గాలు పాటిస్తూనే వుంటాడు (ఉంటుంది). ఆధ్యాత్మికత అంటే కేవలం నాలుగు గోడల మధ్య కూర్చోని  అలంకారాలు (అదొక తంతు గా ) చేసుకుని తన, కుటుంబ సంక్షేమ, పాపపరిహారార్ధం కోసమే అని ఎక్కడా చెప్పలేదు,  కర్మ కాండ చేయవలసినదే. "ఉపవాసం" అనేది శరీరానికి ఒక పూట విశ్రాంతి ద్వారా ఆరొగ్యాన్నిచ్చేందుకు. బాలగంగాధర్ తిలక్ మన దేశంలోని  "ఆకలి" అనే దారిద్ర్యాన్ని తొలగించటానికి ఒక్కోక్కరూ  ఒక పూట భోజనం మానేస్తే చాలూ ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని అన్నారు మహానుభావులు. 


                        ఆధ్యాత్మిక అంటే ఏదొ ఒక "దైవం" లేదా కనబడని ఒక "శక్తి " ని కొలవటం. అదే ఒక వ్యక్తి ని దైవం గా ఆరాధించటం కష్ఠం,  కారణం అతనిలో ఏదో ఒక లొపం చూడటానికే ఒక సామాన్య మానవుడి యొక్క  మనస్సు లఘ్నమవుతుంది. మనిషికి శిశుదశ నుండే ఆధ్యాత్మిక విలువలు నేర్పుతారు. ఇక చదువుకోవటం మొదలుపెట్టినప్పటి నుండి సరి అయిన దిశాదర్శనం (ముఖ్యంగా విద్యా - బుధ్ధులు ) ఇయ్యకపోతే  క్రమంగా,  క్రమశిక్షణ కు దూరమవుతాడు. అప్పుడు క్రమేణ కోరికలు జయించటం మొదలు అవుతుంది. ఆ కోరికలు బలీయమయి మనస్సును జయించడం   మొదలుపెట్టినప్పటినుండి పతనం (మానసిక, శారీరక) ఆరంభమవుతుంది. శారీరక ధృడత్వం లేకపోయినా పర్వాలేదు, కానీ మానసిక దుర్భలత్వం పనికిరాదు. ఇక్కడ ఒకటి గ్రహించాలి, సమాజంలో ఎక్కువమంది ఈ రకంగా ఆలోచిస్తున్నంతవరకు, ఏ ఒక్కరికయినా మంచిని  ఆచరించటాని మనస్సు ఒప్పుకోక పోతే అతనికి  సమాజమే సరి అయిన మార్గదర్శనం ఇస్తుంది.


                        విలువలతో ఉన్నవాడు పైకి ఆధ్యాత్మికతో ఉన్నట్లుగా కనబడకపోవచ్చు,  కానీ సమాజంలో ఏ వ్యక్తి అయినా ఉన్నతస్థాయిని చేరుకున్నాడంటే అతను తప్పని సరిగా ప్రాధమిక విద్యా దశ నుండి ఆధ్యాత్మికత, క్రమశిక్షణ, నైతిక విలువలతో కూడిన  విద్య ను తప్పనిసరిగ  అభ్యసించి  ఉంటాడు. 
 

                        పూర్వకాలం నుండి ఇన్ని రకములయిన విలువలతో కూడిన విద్య మనకుంటే, అదేమిటో మన దేశంలోని వారికి అదొక "మత" (మతం తెలిపేది ఆరాధనా పధ్ధతి మాత్రమే) పరమయిన (ఆఖరికి యోగ కూడ) విద్యగా కనబడి "మడి" కట్టుకుని వాటిని తాకనీయకుండ చేసారు. కానీ  ప్రపంచంలోని ఇతర దేశంలోని వారికి అవి "మత" పరంగా కనబడకపోగా అలాంటి "ఆధ్యాత్మిక,  క్రమశిక్షణ, నైతిక విలువలతో కలిగిన విద్య" ను మన "మడి" నుండి వారు తీసుకుని తమ "ఒడి" లో బెట్టుకుని  ఎప్పుడో అక్షరాభ్యాశం చెసేశారు.  


                        మనం కోంచె సూక్ష్మంగా ఆలోచిస్తే  మన సంస్కృతి, ఆధ్యాత్మిక, నైతిక, క్రమశిక్షణ మొదలగు వానిలో చాలా ధర్మపరమయిన, సున్నితమయిన, మన సమాజంలోని వారికే కాక ప్రపంచం లోని ప్రతి వ్యక్తి యొక్క శ్రేయస్సు  కోరేవిధంగా వున్నాయి.


                       కొంత మంది "గ్రంధకర్తలు, సంఘ సంస్కర్తలు, చరిత్రకారులు "ఏదో ఉద్దేశ్యంతో" విలువలు లేని వాటితో మనకు (ఇప్పటి తరాని వారికి) "అక్షరాభ్యాశం" చేయించి, వారు మాత్రం  వారి కుటుంబ పాపపరిహారార్ధం అన్ని రకాల ఆధ్యాత్మిక విలువలు ఎక్కడ దొరికితే అక్కడ వాటిని భద్రంగా మూట గట్టి వాళ్ళ తరతరాల సంతానానికి అందేటట్లుగా చేసుకున్నారు.  నాదొకటే సందేహం! ఈ ఆలోచన కలవారందరూ వారి కుటుంబంలోని పిల్లలను కూడా ఇదే విధంగా అనాధ్యాత్మికంగా పెంచారా, పెంచగలరా? 

మతం: ఆరాధనా పధ్ధతిని తెలియజేస్తుంది.
  జాతి: ఉనికిని తెలియజేస్తుంది.  అని నాఅలోచన....................................

8 comments:

 1. మీ అలోచన బాగుంది

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదములు "కష్ఠేఫలి" గారు.

   Delete
 2. మీ ఇజం ఏమిటసలు? మీ భావజాలం ఏమిటి? కమ్యూనిజమా? అర్‌ ఎస్‌ ఎస్‌ ఆ?
  మీ శైలి బాగుంది, కానీ మీ భావజాలాన్ని కనిపెట్టలేకపోతున్నాను.

  కొద్దో గొప్పో మార్క్సిజానికి సానుభూతి కనిపిస్తోంది. బ్లాగులోకంలో మార్క్సిజం గురించి ఓనమాలు తెలియని వాడు కూడా బ్లాగు తెరిచి ఇష్టమొచ్చిన రాతలు రాస్తున్నారు. మార్క్సిజంలో ని నిజాలు మీలాంటి పెద్దలు కొద్దిగా దృష్టిపెట్టి చదువరులకు అందించ ప్రార్ధన

  ReplyDelete
  Replies
  1. నమస్తే "అభినయ" గారు.
   మీ అభిప్రాయానికి నా ధన్యవాదము.
   నిజానికి నాకు నా ఏ "ఇజము" లేదు. అసలు మన దేశ చరిత్ర గురించి ఎవరో వ్రాస్తే చదివేదానికన్నా, మనకి మనమే మన అసలయిన చరిత్ర తెలుసుకుని తరువాత తరాలకి కూడా అందించగలిగితే బాగుంటందని నా ఆలోచన...........

   Delete
 3. >>ప్రపంచంలోని ఇతర దేశంలోని వారికి అవి "మత" పరంగా కనబడకపోగా అలాంటి "ఆధ్యాత్మిక, క్రమశిక్షణ, నైతిక విలువలతో కలిగిన విద్య" ను మన "మడి" నుండి వారు తీసుకుని తమ "ఒడి" లో బెట్టుకుని ఎప్పుడో అక్షరాభ్యాశం చెసేశారు.

  ఆ "ఇతర దేశం" ఏది?

  ReplyDelete
  Replies
  1. మీ రావి శాస్త్రి "పిపీలకం" లో ఈ నెల 24న ఇచ్చిననా జవాబు చూడగలరు(http://yaramana.blogspot.com/2012/01/blog-post_11.html). విష్ణుశర్మ వ్రాసిన "పంచతంత్రం" ను పరవస్తు చిన్నయసూరి చే తెలుగులోకి అనువదింపబడిన "నీతిచంద్రిక", కౌటిల్యుని "అర్ధశాస్త్రము" ను దాదాపుగా 200 భాషలలో, 50 దేశాలకు పైగా అనువదించికున్నారు.

   Delete
 4. Replies
  1. ధన్యవాదములు ప్రసాదరావు గారు.

   Delete