Pages

Sunday, February 12, 2012

ఒక సంఘటన.........


                                నేను కుటుంబ సమేతంగా మా అన్నయ్య వాళ్ళ ఊరునుండి తిరిగి మా ఊరు బయలుదేరటానికి రైల్వే స్టేషనుకు వచ్చాము. రైలు రావటానికి ఒక గంట ఆలశ్యం అని అనౌన్స్ చేసారు. సరే కదా అని నేను, నా పాప రైల్వే  ప్లాట్ఫార్మ్ మీద అలా చిన్నగ నడుచుకుంటు అక్కడ ఉన్న ఫ్లైయోవర్ ఎక్కుతున్నాము. ఒక 3 లేద 4 ఏళ్ళ వయస్సుగల పిల్ల వాడు ఆ ఫ్లైయోవర్ మెట్లు ఎక్కి, మళ్ళా దిగుతూ అలా ఆడుకుంటున్నాడు. నేనొకసారి చుట్టూ  పరికించి చూసాను. మెట్లమీద అంతగ జన రద్దీ లేదు. ఎవరిదోవన  వారు వెళ్తూనే  ఉన్నారు. బహుశః  నా పిల్లవాడనుకున్నారో ఏమో! తప్పనిసరిగ ఈ పిల్లవాడు దారి తప్పాడు అని అనుమానమొచ్చి వాడు మెట్లుదిగుతున్నప్పుడు వాడికి అడ్డముగ నుంచున్న. అతను పక్కకితప్పుకుని మెట్లు దిగటానికి ప్రయత్నించాడు. మళ్ళీ అడ్డముగ నుంచున్న. అలా మూడు నలుగు సార్లు చేసేటప్పటికి ఆ పిల్లవాడు బిక్క మొహమేసుకుని ఒక్కసారిగ "అమ్మా" అంటూ ఏడుపు మొదలెట్టాడు.

                                 నిజంగా "ఆ ఏడుపు" వింటే ఎంత కర్కోటకుడికి అయిన హృదయం ద్రవించక  తప్పదు. ఒక బేల తనము, భయము, ఆందోళన అనేవి  ఖచ్చితముగ వ్యక్త పరచలేని వయస్సు,  కన్న తల్లికి తప్ప ఎవరికి వర్ణించడాఇనికి కూడా వీలుగానిది ఆ పిల్లవాడి ముఖములో చూసాను. మా పాపకు కొంచెం జాలేసి ఎవరు లేరనుకుంట "నాన్న ఈ తమ్ముడుని మనం పెంచుకుందాము" అంది. నాకు చాలా సార్లు ఇలాంటి ఆలోచనే వచ్చేది. పోలీసులకు అప్ప చెప్పితే? సహజముగ ఏ మనిషి తొందరగ ఎదుటి వారి మీద, అది కూడా ఇలాంటి  సంధర్భములో నమ్మకము కుదరదు. ఎందుకంటె పొరబాటున ఇలా తప్పిపోయిన వాళ్ళు అందకూడని చేతికి అందే దానికన్న మన దగ్గరే ఉంటేనే బాగుంటుందనే ఆలోచన చాలామందికి కలుగుతుంది. అదే సమయములో కొంతమందికి కుటుంబ పరిస్థితులు సహకరించక పోవటము వలన  ఇంకొకరి అప్పచెప్పి వెళ్ళిపోతారు.

                                 నేను, మా పాప అక్కడే మెట్టు మీద కూర్చుని బాబుని నా ఒళ్ళో కూర్చొబెట్టుకుని బుజ్జగిస్తున్న. ఆ సన్నివేశం చూస్తే ఎవరికయిన మా పిల్లవాడే అనుకుంటారు. (పిల్లల్ని ఎత్తుకెళ్ళేవారు  ఆచరించే పద్దతులలో ఇదొకటి. ఎవరికీ అనుమానం రాదు). మా పాపకని కొన్న చాక్లెట్లు తీసి పిల్లవాడికి ఇచ్చా. ఒద్దన్నట్టుగా తల అడ్డంగా తిప్పుతూ  "అమ్మ" కావాలి అన్నాడు. "ఇవిగో మీ అమ్మ ఇచ్చింది తిను ఇంకా చాలా వున్నాయి అవి కూడా నీకే ఇస్తా,  మీ అమ్మదగరకు వెల్దాము రా అన్న. కొద్దిగ వాడి ముఖములోని ఏడుపు తీవ్రత తగ్గి చిన్నగ మాకు సహకరించాడు. పాపం పిల్లవాడు. పెద్దవాళ్ళే మోసపోతున్నారు (ఇంకో విధముగ). 

                                ఆ బాబుకి ఈ మాయా (కుల, మత, ప్రాంత, రాజకీయ, చరిత్ర, ఆర్ధిక, సిద్ద్దాంత, ద్వేషాల) ప్రపంచం గురుంచి తెలుసుకునే వయస్సుకు  ఇంకా ఎదగలేదు. అక్కడ రైలు ఎక్కటానికి వచ్చిన వాళ్ళలో ఈ బాబుకు సంభందించిన వాళ్ళెవరయిన  ఉన్నారేమో ఒక సారి చూద్దామని ( సహజంగా ప్లాట్ఫార్మ్ మీద ఉన్నవారందరూ రైలు వచ్చే దిశగా చూస్తుంటారనే ఆలోచనతో) మా పాప, నేనూ  బాబు చెరొక చేయి పట్టుకుని ప్లాట్ఫార్మ్ అంచుగ నడవనారింభించాము. 

                                కొంత దూరం వచ్చేసరికి ఒక ఆవిడ మా దగ్గర ఉన్న పిల్లవాడిని చూసి హడావిడిగా మా వైపు వస్తోంది. ఆమెకు నాలుగు చివాట్లు  పెట్టాలనే ఉద్దేశ్యంతో పిల్లవాడిని ఆవిడకు కనబడకుండా కొంచెం వెనక వైపుకు ఉంచాను. మా పిల్లవాడండి అంది. ఎవరు అని చాలా కోపంగా అరిచా. ఆ అరుపుకి ఒక్కసారి అందరూ మా వైపు చూసారు. నా సంస్కారం కోల్పోయి పలురకాలుగా ఆమెను తిట్టాను. (అప్పుడే అనిపించింది  ప్లాట్ఫార్మ్ మీద టీవిలు ఉండకూడదని). ఆమె వెనుకనే వచ్చిన ఒకతను ఏమిటండి మీ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. పొరపాటు ఎవరికయినా జరుగుతుంది. అంతమాత్రానికే అలా మాట్లాడాలా. ఆ తల్లి రెండు చేతులు జాపగానే  "అమ్మ" అంటూ   పిల్ల వాడు ఒక్క ఉదుటున తల్లి మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగ కౌగలించుకున్నాడు. ఎంతయినా తల్లి ఒడిలో దొరికే సుఖం ఇంక ఎక్కడా దొరకదు. ఇది ప్రకృతి మనకిచ్చిన గొప్ప కానుక.   

                                  ఏమండి కొన్ని పొరపాటులవలన కలిగే నష్ఠం ప్రకృతి కూడా మనకు తిరిగి ఇవ్వదు. ఒక్కసారి ఊహించుకోండి! మనము  ప్రయాణం చేసే రైళ్ళల్లో కొంతమంది పిల్లలు వాళ్ళ వంటి మీద చొక్కా తీసి దేక్కుంటూ కంపార్టుమెంటు ఊడుస్తూ అడుక్కుంటున్నప్పుడు మనమే అంటాము "చదువుకోవటానికి బద్దకమేసో, చెడు అలవాటులకు అలవాటుపడ్డాడనో, తల్లిదండ్రులకు భుద్దిలేదనో  ఇంకా చాలా రకాలుగా తిడతాము. అదే అమ్మాయి అయితే C/o వ్యభిచార కొంపలు".

                                 మరొక  మూడు సంఘటనలు వేర్వేరుగ  జరిగాయి. ఒకటి బస్సులో, ఎవడో ఒక అమ్మాయిని (షుమారు 10సం.లుంటాయి) సినిమాకని తీసుకు వచ్చి వేరే బస్సు ఎక్కుదాము, నీవిక్కడే ఉండు వాటర్ బాటిల్ తెస్తా అని వెళ్ళగానే తెలివిగ ఈ అమ్మాయి వేరే బస్సు ఎక్కింది. అనుకోకుండా ఆ బస్సులోనే నేనున్నా. రెండవది నేను రైల్లో ప్రయాణం చేస్తుండగా ఒక స్టేషన్లో ఆగినప్పుడు ప్లాట్ఫార్మ్ మీద ఒకడు ఒక అమ్మాయిని పట్టుకున్న తీరు చూసి నేను రైలు దిగి వాడి దగ్గరకు వెళ్ళగానే అమ్మాయిని వదిలి హడావిడిగా, స్పీడుగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మూడవది ఒక పిల్లవాడు (షుమారు 8సం.లుంటాయి) వాడి స్నేహితుడు (షుమారు 12సం.లుంటాయి) రైల్లో నా ఎదురుగ కూర్చున్నారు. సరదగా ఊళ్ళు తిరుగుదామనిట. ఇంట్లో వాళ్ళకు తెలియకుండ వచ్చారు.

                                 పై మూడు సంధర్భములలో నేను నా ఆఫీసుకు వెల్తున్నప్పుడు జరిగినవే. నా ఆఫీసులో కూర్చోబెట్టుకుని సమోసాలు, బిస్కెట్లు అవి ఇచ్చి తింటూ ఉండు అని నా వర్క్ చూసుకుంటు మధ్యలో ఏమిచేస్తున్నారో చూస్తున్నాను. నా సిబ్బందిని సరదాగా కబుర్లు చెప్పండి అన్నా. చిన్నగ నా అఫీసు వాతావరణానికి అలవాటయ్యారు అనిపించినప్పుడు వాళ్ళకి ఒక తెల్ల కాగితం ఇచ్చి, నీకు ఉత్తరము వ్రాయటం వచ్చా. "సెలవులకు అమ్మమ్మ వాళ్ళ ఊరుకెళ్ళి అక్కడ ఏమేమి చూసావో" మీ అమ్మకు చెప్పాలికద. పాపం మీ అమ్మ నీకోసం ఎదురు చూస్తుంది కద అని అక్కడనుండి ప్రక్కకొచ్చాను. ఆ కాగితం మీద వ్రాసిన వివరాలను బట్టి, వాళ్ళతో సరదాగ మాట్లాడుతూ వివరాలు సేకరించిన మీదట  పిల్లలు, నేను అదృష్ఠవతులమయ్యాము. వాళ్ళు వాళ్ళ తల్లుల దగ్గరకు, దానివలన నాకు మనశ్శాంతి  దొరికింది. ఇలాంటి సంఘటనలను చాలా మంది ఎదుర్కునే  ఉంటారు. నా తోటి ఉద్యోగులు "ఎమయ్య నీకు ఎప్పుడూ ఇలాంటివే కనబడుతాయేంటి" అన్నారు. ఏమో! నా తల్లిదండృల సంస్కారం వలన అనుకుంట.

                                కాలం గడుస్తున్నకొద్ది ఇలా పిల్లలను ఎత్తుకెళ్ళటం అనేవి పెరుగుతున్నాయి. మరి దీనిని ఏరకమయిన అభివృధ్ధ్ధి అనవచ్చు. ఈ అభివృధ్ధికి "ఏ సిధ్ధాంతాన్ని" ప్రామాణికంగా తీసుకోవాలి. సమాజములో పూర్వం కన్నా మెరుగుబడిన  విద్య, సాంకేతిక, శాస్త్రీయ, సాంకేతిక, ఆర్ధిక, నైతిక, మానవత, సంస్కార (కొంతమంది అనుకునె) విలువలా!! అని ఒక సారి నాకు నేనే ప్రశ్నించుకుంటే వచ్చిన  సమాధానమొక్కటే. పూర్వం మనకు భోధించిన "విద్యా - బుధ్ధులలొ", బుధ్ధిని (క్రమశిక్షణ) తీసేసి కేవలం విత్తును సంపాదించే విద్య, తోటి మానవుడు గురించి ఆలోచింపజేసే  "సామాజిక స్పృహ" కావలసినంతగ లేకపోవటం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.  "ధర్మపధముగా" నడవ వలసిన  చోట దాదాపుగా తప్పటడుగు పడుతోంది.

                              ఆధునికత అంటే ఉన్నదానిని తీసేసి కొత్తదనాన్ని స్వీకరించటము కాదు. పిల్లలకు కనీసం ప్రాధమిక విద్యా దశ వరకు  మన దేశ భౌగొళిక, సామాజిక అవసరాలను దృష్ఠిలో పెట్టుకుని సరి అయిన "విద్యా భుధ్ధులను" అందిస్తే తరువాత తరం వారయినా  పెద్దయిన తరువాత సమాజములో ఇంకా మంచి వాతావరణమును నెలకొల్పవచ్చు అనే  నమ్మకంతో నా ఈ ఆలొచన............   

                                        "యత్భావం తత్భవతి

                                     ఋగ్వేదంలో ఒక సూక్తి -  
                                 "ఆనో భద్రహ క్రతవోయంతు విశ్వతహ". 
                              Let noble thoughts comes to us from all sides. 


                                          సర్వ్ జనా సుఖినో భవంతు.                                  
                              

17 comments:

 1. EE saili chuste meedi kaadanipistondi. Anyway interesting incidents.

  ReplyDelete
  Replies
  1. Thank you Surya garu,
   I don't know how you have concluded that "EE saili chuste meedi kaadanipistondi". I am curious to know the "saili", is it the script or !!!.

   Delete
  2. JUST LIKE THAT! ENDUKO ALA ANIPINCHINDI. INTAKA MUNDU MEE POSTS KI BINNAM ANIPINCHINDI. PROBABLY SCRIPT VALLANEMO!!!

   Delete
  3. సూర్య గారు, మీ స్పందనకు నా హృదయపూర్వక ధన్యవాదములు.
   Thank you very much for your feed back.

   Delete
 2. ఒక సంఘటన- ఆలోచింప చేసేదిలాగా వుంది

  ReplyDelete
  Replies
  1. మీ కాంప్లిమెంటుకు ధన్యవాదములండి.

   Delete
 3. పోస్ట్ బాగుంది.

  పిల్లల్ని ఎత్తుకుపోవడం అనేది ఒక నేరం. అన్ని నేరాల్లాగే సమాజంలో ఈ నేరం కూడా పెరుగుతుంది.

  రైలు ఎక్కే హడావుడిలో పిల్లల్ని, వృద్ధుల్ని పక్కకి తోసేసి ఎక్కేసే రోజులు ఇవి.

  I appreciate your concern and sensitivity. keep it up.

  ReplyDelete
 4. మూర్తి గారూ, ఇలాంటిదే నాకూ ఓ సంఘటన జరిగింది. తల్లి తండ్రి మందలించారని ఇంట్లో చెప్పకుండా కర్నాటక నుంచి పారిపోయి వచ్చిన కుర్రాడు విజయవాడ రైల్వే స్టేషన్ లో నాకు తారసపడ్డాడు. వాడిని తెచ్చి ఓ 4 , ౫ రోజులు మా ఇంట్లో వుంచి మెల్లిగా వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి పిలిపించా. ఆయన కళ్ళలో ఆనందం చూస్తె తెలిసింది అలా వాడిని తేవడం ఎంత మంచి పని అయిందో. మరీ టీవీ చూస్తూ పిల్లల్ని పోగొట్టుకునేవాళ్ళకి మాత్రం నమస్కారం.

  ReplyDelete
  Replies
  1. లక్ష్మీబాయ్ గారు ధన్యవాదములు.
   ఆ పిల్లవాడి తండ్రికి పిల్లోడు దొరికిన ఆనందం, పిల్లవాడిని వాడి తండ్రికి అప్పచెప్పిన తరువాత మీరు పొందిన ఆనందం నిజంగా ఒక అనిర్వచనీయమయిన అనుభూతి. పూర్వ జన్మ సుకృతం, తల్లితండ్రులనుంచి వచ్చిన సంస్కారం వలన సమాజంలో చాలామంది చాలా రకాలుగ ఇతోధికంగా సహాయపడుతూనే ఉంటారు. కానీ నా దృష్ఠిలో తప్పిపోయిన పిల్లలను మనసారా దగ్గరకు తీసుకుని వారి తల్లిదండృలకు అప్పచెప్పినదానికంటే ఇంకేది అంతగొప్ప సమాజ కార్యం అని అనుకోను. ఇది సమాజ సేవ అనేదానికన్న ఒక "భాద్యత" అనుకుంట.

   Delete
 5. నేటి వాస్తవిక సంఘటనలను సరిగ్గా వివరించారు. 'ఒక సంఘటన' పోస్ట్ అందర్నీ ఆలోచింపజేసేట్లు వుంది.

  ReplyDelete
  Replies
  1. భారతి గారు, మీ స్పందనకు ధన్యవాదములు.

   Delete
 6. very good post sir. god bless you and your daughter for your noble thoughts.

  ReplyDelete
  Replies
  1. Thank you very much for your kindness.

   Delete
 7. బాగా చెప్పేరు. మంచి అనుభవం....ఆలస్యంగాచూశా.

  ReplyDelete
  Replies
  1. కష్టేఫలి గారు, ధన్యవాదములు. ఇలాంటి సంఘటనలు దాదాపుగ చాలామంది ఎదుర్కొనే ఉండే ఉంటారండి.

   Delete