Pages

Friday, January 6, 2012

మన మంచి మనతోనే వస్తుంది.............

ర్ణుడు మహాభారత యుధ్ధం తరువాత స్వర్గానికి వెళ్ళాడు. అక్కడున్న దేవతలు సాదరంగా ఆహ్వానించి  "ఓహో!దాన, వీర, శూర కర్ణా స్వాగతం, సుస్వాగతం" అని ఆహ్వానించారు. 
లోపలికి వెళ్ళాక "కర్ణా! ఈ స్వర్గం లో ఒక నియమం ఉంది. అదేమిటంటే  నీవు భూలోకంలో ఏ ఏ దానాలు చేసావో, అవన్నీ నీకు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. నీవు చేసినన్ని దానాలు, మరే చక్రవర్తి చేయలేదు. చివరకు కవచ కుండలాలు కూడా దానం ఇచ్చావు" అన్నారు. 
"దానిదేముంది? అవి నాకెందుకు? ఏదో నామ స్మరణ చేసుకుంటూ ఇంత తిని పడుకుంటే చాలు" అన్నాడు కర్ణుడు. 
అదే చెప్తున్నాము, నీవు భూలోకములో బంగారం ఇచ్చావు. అదే ఇస్తాము. నీవు ఒక్కరికి కూడా పిడికెడు ముద్ద పెట్టలేదు. కాభట్టి నీకు ఇక్కడ అన్నం దొరకదు అని చెప్పారు. దాంతో కర్ణుడు కంగారుపడి "మరి దీనికి మార్గమేమిట్?" అని అడిగాడు. అప్పుడు దేవతలు "నీకు నెల రోజులు సమయమ ఇస్తున్నాము. నీవు వేరే రూపం లో వెళ్ళి దాన ధర్మాలు కాకుండా అన్న దానం చేసుకురా" అని పంపారు. 
"ఎంత గొప్ప వారయినా, వీరుడైనా, శూరుడైనా గుర్తుంచుకోవలసినది మనము చేసిన మంచి మాత్రమే మనతో ఉంటుంది".

 "శుసంస్కారం" నుండి గాడి తప్పి "కుసంస్కారం" లోకి వెళ్ళకుండ  వుండటానికే, విలువగల విషయము తెలిసినదే అయినా మరచిపోకూడదని  నిత్యం మననం చేసుకుంటూ ఉంటాము. 
సదా సుఖీభవ.....
 

3 comments:

  1. అందుకే అన్నారు దయకంటే పుణ్యం లేదు! నిర్దయ కంటే పాపం లేదు! చెట్టుకి చెంబుడు నీళ్ళు, పక్షికి గుప్పెడు గింజలు, పశువుకి నాలుగు గడ్డి పరకలు, ఆకలితో ఉన్న మనిషికి పట్టెడు అన్నం ఉత్తమ దానాలు అని!

    ReplyDelete
  2. murthy gaaru manchi vishayam chepparu dhanyavaadamulu

    ReplyDelete
  3. కామెంట్స్ వ్రాసిన రసజ్ఞ, మరియూ తెలుగు పాటలు వారికి ధన్యవాదములు.

    ReplyDelete