![]() |
Add caption |
రాజ్యాంగ కమిటి లో --- "సెక్యులర్" రాజ్యం ప్రత్యేకంగా ఏ మతాన్ని బలపరచకూడదు, కాని అదే సమయంలో రాజ్యం సెక్యులర్ కాబట్టి ప్రజల ఆధ్యాత్మికత విద్యకు ఆటంకము కల్పించకూడదని, సెక్యులర్ రాజ్యం అంటే మత వ్యతిరేకం, మతంతో సంభంధం, లేదా దేవుడు లేదనటం కాదు. ఇంకా వివరంగా "సెక్యులర్ రాష్ట్రం అనగా దేవుడు లేకపోవటం, మతాన్ని కూకటి వేళ్ళతో పీకేయటం, మతాన్ని వ్యతిరేకించడం కానే కాదన్నారు". మతానికి సంభందించిన అసలయిన విలువలను, మనస్సు (ఆత్మ) కు సంభందమయిన విలువలను ఒకే దృష్ఠితో చూడగలిగేదే "ధర్మం". మన రాజ్యాంగ నిర్మాణ సభ యొక్క ముద్రికలో "ధర్మచక్ర ప్రవర్తనాయా" అని, మన లోక్ సభ బిల్డింగ్ మీద
" నాసా సభా యత్ర న సంతివృద్ధా; వృద్ధా నతే యో న వదంతి ధర్మం" అని ఉన్నది.
"రాజ్యం" అనేది నిత్యం రోజు జరిగే వ్యవహారములకు సంభందించిన వ్యవస్థ కాబట్టి మతము, నమ్మకాలు అనే వాటితో సంభంధం ఉండకూడదు అనే అంశాలను చేర్చాలని విపరీతంగా ప్రయత్నించారు, అదేవిధముగా, ఇక్కడ అనేక మతాలున్నాయి కాబట్టి ఏ మతాన్ని "రాష్ట్ర మతంగా" అంగీకరించాలి అని అడిగారు. ముస్లిం లీగ్ సభ్యులు కొంత మంది Directive Principle లో ఉన్న "ఉమ్మడి పౌర చట్టం" ని వ్యతిరేకించారు.
స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళయినా "సెక్యులర్" అనే పదం మీద రాజకీయ నాయకులకు ఏకాభిప్రాయం ఇప్పటికి లేదు. ఒకరు "సెక్యులరిజం", మరొకరు "సూడోసేక్యులరిజం" అని వాదించుకుంటూనే వున్నారు.
అసలు ఈ "సెక్యులరిజం" ఎక్కడిది, ఎందుకొచ్చింది.
అసలు ఈ "సెక్యులరిజం" ఎక్కడిది, ఎందుకొచ్చింది.
పూర్వం యూరప్ లోని రోమన్ కథోలిక్ చర్చికి అధిపతి అయిన పోప్ కు మతాధికారం తో బాటు రాజ్యాధికారం కూడా ఉండేది. ఈయన మిగతా రాజ్యాదికారులవలె చిన్న చిన్న రాజ్యాలను కలుపుకునేవారు. 1281 లో "లోబోనఫేస్" 8వ పోప్ గ వచ్చినతరువాత ఫ్రాన్స్ రాజు ఫిలిప్ తో పడకపోవటం మొదలయినది. మత సంభందమయిన వ్యవహారం తప్ప రాజ్యానికి సంభందిచిన వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి అర్హత లేదని ఫిలిప్ పెద్ద ఉద్యమంగా దారిపొడవునా ఉన్న రాజ్యాలను కలుపుకొంటూ పోప్ మీదకు దండెత్తాడు. దీనివలన ఎక్కడికక్కడ ఆ దేశపు జాతీయవాదం బలపడి చివరకు "జాతి" సంభందమయిన రాజ్యాలుగా పుట్టడడం మొదలవడమే "సెక్యులర్" యొక్క పరిణామం. పోప్ అన్ని క్రైస్తవ రాజ్యాలు తనక్రింద ఉంటాయనుకొన్నారు. కాని పోప్ కేవలం మతానికి ప్రతినిధి అని, రాజ్యమనేది మతానికంటే భిన్నముగా, స్వతంత్రముగా ఉన్నదని తరువాత తెలుసుకున్నారు.
మరి మన దేశం లో: ఇక్కడ "రాజ నీతి" రాజకీయ వ్యవస్థదే ఉన్నత స్థానమని అంగీకరించింది. మతాధికారులు రాజ్యాధికారం చేలాయించలేదు. రాజకీయ అధికారం మీద ఎప్పుడూ నిఘా (చట్టం, శాసనం) ఉండేది. వేద కాలంలో ఈ పద్ధతికి చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగినది. రాజ్యం ఈ "నియమ" కి లోబడే ఉండాలి. ఈ నియమాల సముదాయమే ధర్మానికి మూలమయి రాజ్యపాలన వలన ప్రజల నైతిక, భౌతిక సంపదను కాపడగలిగేది.
మన దేశంలో "దర్మం", మతం కన్నా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. సమాజ, వ్యక్తీ జీవితం లో అనుసరించాల్సిన నియమాలు, కట్టుబాట్ల సముదాయాన్నే "ధర్మం" అంటాము. ధర్మమనేది కేవలం ఒక దేశానికి, ఒక కాలానికి లేదా ఒక ప్రాంత ప్రజలకు సంభందించినది కాదు. అదే ధర్మం ఒక సమూహముతో, లేదా ఒక వ్యవస్థతో కలిసుంటే అప్పుడది మతమవుతుంది. సత్యం, అహింస, బుద్ది సంపన్నతి, జ్ఞానం, నిదానము, క్షమ, దయ, నిజాయితీ, ఇంద్రియ నిగ్రహం, పవిత్రత అనే 10 రకాల విశేష గుణాలు "ధర్మం" కు ఉన్నాయని "మను స్మృతి" లో చెప్పబడింది.
ధర్మానికి - మతానికి గల తేడ మతానికి కొన్ని ఖచ్చితమయిన నమ్మకాలు ఉంటాయి. ఒక వ్యక్తీ ఎంతవరకయితే ఆ నమ్మకాలకి లోబడి ఉంటాడో అంతవరకే ఆ "మతానికి" సభ్యుడు. ఆ నమ్మకాలను వదిలేస్తే ఆ "మతం" తో సంభంధం తెగిపోయినట్లే. "ధర్మం" మతం మీద ఆధారపడలేదు. సుగుణాలు కలిగి ఉండటమే "ధార్మికత". ధర్మం అనేది ఒక జీవన పద్ధతి. కేవలం నమ్మకాల మీద ఆధారపడి జీవించటం కాదు. కాబట్టి భారతీయ భావనలో "సెక్యులర్" అంటే "స్వధర్మ సమభావం".
ఒక సభలో "నీవు ముస్లిం, నేను హిందూ. ఇద్దరివీ వేర్వేరు మతాలూ, నమ్మకాలు, అసలు విశ్వాసమే లేదు. కాని మన సాంస్కృతిక వారసత్వం మటుకు ఒక్కటే" అని పండిట్ నెహ్రు చెప్పారు.
దేశంలో "సామాజిక, ఆర్ధిక విప్లవం" తీసుకు రావడానికని (emergency సమయంలో) 1976 లో "రాజ్యాంగం" లో 42 వ సవరణ క్రింద ఈ "సెక్యులర్" ను జేర్చారు. మన రాజ్యాంగంలో ఈ "సెక్యులర్" అనే పదం లేకుండానే అన్ని మతాల వారికి మతంతో సంభంధం లేకుండా ప్రతి పౌరుడుకి సమాన స్థాయి కల్పించింది. అంతకముందు జరిగిన మత ఘర్షణలు కన్నా ఈ సవరణ తరువాతే మతః కలహాలు ఎక్కువయినాయి అనుకుంట. ఒక ప్రక్క అన్ని మతాలు సమానమే అంటూ మరొక ప్రక్క చట్టంలో కొన్ని మతాలకు ప్రత్యేకమయిన "ఏర్పాట్లు" కల్పించడం వలన మత కలహాలకు శ్రీకారం చుట్టబడినది. వాస్తవానికి ఈ చట్టాలవలన నిజంగా లబ్ధిపొందేది రాజకీయ పార్టీలుమాత్రమే. కారణం "సెక్యులర్" అనేదాన్ని జాతీయ కారకంగా ఉన్నా, క్రియాత్మకంగా అవలంబించకపోవటం, మత సంభందమయిన విషయాలలో రాజ్య పాలన జోక్యం (ఓట్ల కోసం), అన్ని మాతాలను సామానముగా చూడకుండా బ్రిటీషు వాడి "విభజించి పాలించే" పద్ధతిలాగా, షాబానో విడాకుల విషయమయిThe Supreme Court Judgement on 23rd April 1985 కోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా అప్పటి central government తీసుకున్న నిర్ణయంతో వచ్చిన మత విభేదాలను సమతుల్యం చేయటానికని అయోధ్యలోని "రామ మందిర్" కు కోర్ట్ తీర్పు వలన వేసిన తాళాలను 1985 లో తీసేయటంవలన "మత" పరంగా "ఓటు" సంపాదనకు, మరింత మత కలహాలకు అవకాశం ఇచ్చినట్లయినది అని నా ఆలోచన. M.F. Hussain, Salman Rushdie, Tasleema Nasreen, T. J. Joseph, A.K. రామానుజన్, ఇలా చాలా సంఘటనలు జరిగాయి.Link
రాజ్యంగా పరిషత్ సలహా సంఘ అద్యక్షుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ "ఎన్నికల విధానంలో ఈ మతైక ధోరణిని ప్రవేశపెట్టటం మంచిది కాదు. ఈ ధోరణే దేశ విభజనకు దారితీసింది. పాకిస్తాన్ ఏర్పడిన తరువాత ఇక్కడ మిగిలిన వారంతా ఒకే "జాతి" అని అంగీకరించాము. కాబట్టి మనము ఇకనయిన రెండు జాతుల సిద్ధాంతానికి స్వస్తి పలికితే దేశ పురోగతిని చూడగలుగుతాము" అన్నారు.
రాజ్యంగా పరిషత్ సలహా సంఘ అద్యక్షుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ "ఎన్నికల విధానంలో ఈ మతైక ధోరణిని ప్రవేశపెట్టటం మంచిది కాదు. ఈ ధోరణే దేశ విభజనకు దారితీసింది. పాకిస్తాన్ ఏర్పడిన తరువాత ఇక్కడ మిగిలిన వారంతా ఒకే "జాతి" అని అంగీకరించాము. కాబట్టి మనము ఇకనయిన రెండు జాతుల సిద్ధాంతానికి స్వస్తి పలికితే దేశ పురోగతిని చూడగలుగుతాము" అన్నారు.
రాజ్యాంగంలో ఎంత పటిష్ఠమయిన నియమావళిని పొందుపరుచుకున్నా, ఆచరణలోకి తీసుకురానంతవరకు అవి నిరుపయోగమే. ఎన్నికల్లో అభ్యర్ధి గెలవాలంటే కనీసం 50% పైన ఓట్లు తప్పనిసరిగా రావాలని నిభందన కనకే ఉంటే అప్పుడు ఈ రాజకీయ అభ్యర్ధులు మత భేదం లేకుండ తప్పనిసరిగా అందరినీ కలుస్తారు.
మన కళ్ళముందు కనబడిన చరిత్రకు, మరల వేరేవారెవరో చరిత్ర వ్రాయనవసరంలేదు. మత ద్వేషాలను పెంచే "ఓటు" బ్యాంకు లోని సత్యంను అందరూ గ్రహించగలిగిన రోజున సమాజం సమతుల్యముగా, అందరం సుఖంగా ఉండడానికి వీలుగా ఉంటుందని, ఉండగలదని నా నమ్మకము, నా ఆలోచన..................
--------------"సర్వే జనాః సుఖినో భవంతు"--------------